కడప

నవనిర్మాణంపై పెద్ద ఎత్తున దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 3: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షల్లో శుక్రవారం రెండవరోజు నూతన కలెక్టరేట్‌లో కలెక్టర్ కెవి సత్యనారాయణతోపాటు అధికార యంత్రాంగం, ప్రముఖులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్టవ్రిభజన అస్తవ్యస్తంగా రాజ్యాంగపద్ధతిలో జరగలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కష్టాలు వస్తాయని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. మనకున్న సహజవనరులు ఉపయోగించుకుని స్వశక్తితో, అంకితభావంతో కష్టపడి పనిచేస్తే సౌత్ కొరియా దేశం లాగా తక్కువ సమయంలో అభివృద్ధి చెందగలమన్నారు. సమైక్యాంధ్రకోసం గతంలో మనంపడ్డ శ్రమ వృధా అయ్యిందని అయితే నిరాశ చెందకుండా సౌత్ కొరియా లాంటి చిన్నదేశం, జపాన్, చైనాదేశాలతో యుద్దం చేసి అస్తవ్యస్తం అయినప్పుడు అక్కడి ప్రజలు పట్టుదలతో కేవలం 20సంవత్సరాలలో కష్టపడి పనిచేయడంతో ప్రపంచంలో అగ్రగామి దేశాల సరసన నిలిచిందన్నారు. అప్పట్లో 200 డాలర్ల తలసరి ఆదాయం ఉన్న ఆదేశం ప్రస్తుతం 35వేల డాలర్ల తలసరి ఆదాయంతో ఉందని ఆయన గుర్తు చేశారు. ఇలా అభివృద్ధి చెందిన దేశాలను స్పూర్తిగా తీసుకుని శాస్ర్తియంగా విడిపోయిన మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధిలోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే శనివారం నుంచి జరిగే నవనిర్మాణదీక్ష కార్యక్రమాల్లో ప్రతిశాఖలో భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగా శాఖాధికారులు, సిబ్బంది ప్రసంగించాలని సూచించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అడ్డుకునేందుకు పార్లమెంట్‌లో ఎంత ప్రయత్నం చేశామని ప్రభుత్వం పైన అవిశ్వాసం తీర్మానం పెట్టామని అయినా దుర్మార్గంతో రాష్ట్రాన్ని విభజించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి, ఏపిఎన్‌జివో సంఘం జిల్లాఅధ్యక్షుడు శివారెడ్డి, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు రామమూర్తినాయుడు, వైవియు పాలక మండలి సభ్యులు ధనుంజయనాయుడు, ఎస్.గోవర్దన్‌రెడ్డి, జర్మలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి, టిడిపినాయకులు బి.హరిప్రసాద్, ఉద్యానవనశాఖ సూపరింటెండెంట్ చంద్ర, డిఆర్వో సులోచన, జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, జెసి -2శేషయ్య, టిడిపి రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడు పాల్గొన్నారు.