కడప

పులివెందులలో మారుతున్న రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 3 : ఇటీవల కాలంలో కడప జిల్లా పులివెందులలో టిడిపి బలపడి వైఎస్ కుటుంబానికి, జగన్‌కు ప్రతిపక్షం తయారవుతుందని భావించి వైఎస్ సోదరుడు, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి తెరపైకి వచ్చారు. ఆ క్రమంలోనే వారం రోజుల క్రితం టిడిపి నేతలు, కార్యకర్తలు చేపట్టిన ర్యాలీకి ప్రతిగా వివేకా పెద్దఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించిన కాలంలోనూ, నేడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజకీయాల్లో రాణిస్తున్న తరుణంలో వారిద్దరికీ వైఎస్ వివేకానందరెడ్డి అండగా నిలిచారు. వివేకాకు పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా అపారమైన రాజకీయ అనుభవం ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ వివేకా పులివెందులతో పాటు జిల్లా రాజకీయాలను తన భుజస్కంధాలపై వేసుకుని ఒక వెలుగు వెలిగిన మొండిమనిషి. వైఎస్ మరణానంతరం కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాష్ట్ర మంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్‌లో కొందరు నేతలు వైఎస్‌ని ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడంతో వివేకా మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి గత కొంతకాలం వరకూ క్రీయాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు కాదు. పులివెందుల పట్టణంలో టిడిపి నేతలు కానీ, కార్యకర్తలు కానీ ర్యాలీలు చేయడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం పెద్దగా చోటుచేసుకోలేదు. కేవలం పార్టీ అగ్రనేతలు పర్యటనలోనే తెలుగుతమ్ముళ్లు బయటకు వచ్చేవారు. అయితే ఈ మధ్య కాలంలో పులివెందులలోని టిడిపి కార్యకర్తలు, నేతలు బయటకు వచ్చి పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించడం పాటు వేంపల్లెలో జరిగిన మినీమహానాడు కార్యక్రమానికి తరలివెళ్లారు. అంతకుముందు జగన్, వివేకా అంటీఅంటనట్లుగానే వ్యవహరిస్తూ ఇద్దరూ ఎక్కడ తారసపడినా పరస్పరం మాట్లాడుకోవడం తప్ప రాజకీయంగా చర్చించుకోలేదు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జగన్ చేపడుతున్న కార్యక్రమాలకు పెద్దఎత్తున జనాలు వస్తుండటంతో వివేకా జగన్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాడు అన్న వైఎస్‌కు ఏ విధంగా సహకరించారో అదే తరహాలో జగన్‌కు సహకరించేందుకు స్వయంగా నడుం బిగించారు. జగన్ అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర సందర్భంగా సిఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారం లేచి రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, పార్టీ ఇన్‌చార్జిలు, నేతలు, కార్యకర్తలు జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టడంతో వివేకా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు జిల్లాలో పులివెందులతో పాటు పలు చోట్ల టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో వివేకా కూడా ఆయా ప్రాంతాల్లో సిఎం చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేయించారు. దీంతో పులివెందులలో రాజకీయాలు మరోమారు ఉన్నట్లుండి వేడెక్కాయి. ఇదిలా ఉండగా టిడిపి స్థాపన అనంతరం వైఎస్ కుటుంబంపై అప్పటి టిడిపి అభ్యర్థి డాక్టర్ డిఎన్ రెడ్డి గెలుపొంది వైఎస్ కోటలో టిడిపి జెండా ఎగురవేశారు. నాటి నుంచి నేటి వరకూ అక్కడక్కడ వైఎస్ కుటుంబానికి వ్యతిరేకత ఉన్నా అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి వారిని మచ్చిక చేసుకుని రాజకీయంగా ఎదుగుతూ వస్తున్నారు. వైఎస్ హయాంలో వివేకానందరెడ్డికి పులివెందుల, జిల్లా బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం జగన్ కూడా బాబాయ్‌కే పార్టీ జిల్లా రాజకీయాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.