కడప

పోలీసు నీడలో కడప..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 7: నవనిర్మాణ దీక్షల్లో భాగంగా ముగింపు దీక్షకు సిఎం చంద్రబాబు రాక సందర్భంగా భారీ స్థాయిలో పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం కడప జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తలపెట్టిన దీక్ష ముగింపు కార్యక్రమానికి భారీ ఎత్తున పోలీసులు మంగళవారం సాయంత్రానికి తరలివచ్చారు. గతంలో ఎన్నడూ ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఈ స్థాయిలో బందోబస్తు తరలిరాలేదు. 5వేల మంది పోలీసులు, 12 మంది ఐపిఎస్ అధికారులు, డిజిపితో సహా రాష్టప్రోలీసుయంత్రాంగంతోపాటు కడపకు తరలివచ్చారు. వాస్తవంగా ఈ సంకల్పదీక్ష మహాసభ తొలుత ఒంగోలులో నిర్వహించాల్సివుండగా చివరిక్షణంలో కడప జిల్లా కేంద్రానికి మార్పు చేశారు. సంకల్పన దీక్ష సభకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌బాబుతోపాటు రాష్ట్రంలోని పలువురు మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరుకానున్నారు. ఈ నేపధ్యంలో జిల్లా కేంద్రంలో 400 పైబడి నిఘా కెమెరాల మధ్య అడుగడుగునా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం రానుండటంతో భారీ ఎత్తున పోలీసులు, పోలీసు అధికారులు సంకల్పన సభకు భారీ ఎత్తున రాష్ట్ర, జిల్లా యంత్రాంగం తరలిరావడంతోపాటు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభ సందర్భంగా ముందస్తు జాగ్రత్తలో భాగంగా డిఐజి జెవి రాముడు స్వయంగా ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఇంత భారీ బందోబస్తు గతంలో ఎన్నడూ ఏర్పాటుచేయలేదు. సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఎటువంటి ఆటుపోట్లకు గురికాకుండా ఎటువంటి అవాంఛసంఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఇటీవల వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై కాలు దువ్వడంతో అధికారపార్టీ నేతలు, ప్రభుత్వం గట్టి పటిష్ట బందోబస్తును జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేయడం ఇదే ప్రప్రథమం. అలాగే జగన్మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వాడి వేడిగా ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో రాష్ట్ర పోలీసుశాఖ, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు పటిష్టంగా ఉన్నాయి. గత వారంరోజులుగా కలెక్టర్ కెవి సత్యనారాయణ తరచూ జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగంతోనూ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మహాసంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మున్సిపల్ మైదానంలో వేదిక ఏర్పాటుచేశారు. ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న ముగ్గురు ఐపిఎస్ అధికారులు, డిఎస్పీలతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటుచేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేగాకుండా సిఎం విమానాశ్రయం నుంచి సభ వేదికకు చేరుకునేలోపు ఆయన జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వరకు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ కెవి సత్యనారాయణ స్వయ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అలాగే రాష్ట్ర, జిల్లా నాయకులతో బాబు బుధవారం రాత్రి, గురువారం ఉదయం సమీక్ష సమావేశాలకు కూడా రోడ్ మ్యాప్‌ను గుర్తించి భారీ ఏర్పాట్లు చేశారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్, ఎస్పీ గత మూడురోజులుగా కంటికి కనుకులేకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.