కడప

గ్రామాల్లో విద్యుత్‌శాఖ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబులవారిపల్లె, జూన్ 9:మండలంలోని ఓబులవారిపల్లె, చిన్నఓరంపాడు, గాదెల, చిన్నంపల్లె, గొబ్బివారిపల్లె గ్రామాలలో గురువారం ట్రాన్స్‌కో ఏఇ యోగానంద్ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై 60 కేసులు నమోదు చేసి, రూ.2.20 లక్షల జరిమానా విధించామని ఏఇ తెలిపారు. అధిక ఓల్టేజీ వాడుతూ లోఓల్టేజీ చూపే వారిపై 60 కేసులు నమోదు చేసి రూ.90 వేల జరిమానా విధించామన్నారు. గ్రామాలలో తారతమ్యాలు లేకుండా ప్రతి ఒకరు తమ ఇళ్లకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ మీటర్లను కూడా వారి స్థాయిని బట్టే తక్కువ ధరలకే ప్రభుత్వం అందజేస్తోందన్నారు. మీటర్లు లేకుండా విద్యుత్ చౌర్యంకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై విద్యుత్ అధికారులు గ్రామాలలో తిరుగుతూ అక్రమ విద్యుత్ వాడకం దారులపై నిఘా పెట్టి, కేసులు నమోదు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిఇ నాగరాజు, ఆపరేషన్ డిఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఏడిఇ ఎం.సురేంద్రనాథ్, విద్యుత్ అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు.

పొలంలో బయటపడ్డ రాతి గొయ్యి..
ముద్దనూరు, జూన్ 9:మండల పరిదిలోని ఉప్పలూరు గ్రామంలో గురువారం రాతి కట్టడంతో కూడిన గొయ్యి బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు వెంకటసుబ్బయ్య అనే రైతు తన పొలంలో ట్రాక్టర్‌తో సేద్యం చేస్తుండగా దాదాపు రెండు అడుగుల లోతులో దుక్కి తగులుకుని నల్లబండ పక్కకు సర్దుకోవడంతో గొయ్యి బయటపడిందని తెలిపారు. గొయ్యి మాత్రం ఆరు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో పది అడుగుల లోతుగా రాతి కట్టడంగా వుండడంతో గ్రామస్తులు పురాతనమైన గొయ్యిగా భావిస్తున్నారు. పురాతనకాలంలో నీటి కోసమో లేక, గుప్తనిధులు దాచిపెట్టడం కోసమో గొయ్యిని తీసివుంటారని ప్రజలు భావిస్తున్నారు.