కడప

యువతను తప్పుదారి పట్టిస్తున్న డ్రగ్ మాఫియా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 27: జిల్లాలో ఓ పక్క మాదకద్రవ్యాల మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా కార్యకలాపాలు పెట్రేగిపోతున్న తరుణంలో యువతను, ముఖ్యంగా అభంశుభం తెలియని విద్యార్థులను మాఫియా డాన్లు రొచ్చులోకి దింపారనేది జగమెరిగిన సత్యం. జిల్లాలో డ్రగ్ మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలపై చాలా మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలిసినా పలువురు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని తమ విధి నిర్వహణ గాలికి వదిలేసి వ్యవహరిస్తున్న కారణంగా మాఫియా చర్యలు పూర్తిస్థాయిలో యువతనే పక్కదారిపట్టించి సమాజాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్న వ్యవహారాన్ని పోలీసు అధికారులు పొరపాటుపడుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ మాఫియా కేరళ మొదలుకుని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వ్యాపించి చివరకు గల్ఫ్ చేరి జిల్లాలోని రాయచోటి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట ప్రాంతాల్లో యధేచ్చగా మాదకద్రవ్యాలు చెలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎర్రచందనం ఎగుమతుల్లో గల్లీ మొదలుకుని ఢిల్లీ నుంచి ఇతర దేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ వాటి ఎగుమతులను నేరుగా అంతర్జాతీయ స్మగ్లర్లకు చేర్చి ప్రతినిత్యం కోట్లరూపాయల్లోనే లావాదేవీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న బిటెక్ విద్యార్థులను ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దించి వారికి అంతో ఇంతోముట్టచెప్పి విలాసవంతమైన జీవితాలు అనుభవించే యువతను, పేదరికంలో మగ్గుతున్న మరికొంతమంది యువతను ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ఉపయోగించుకుంటూ యువతను పక్కదారి పట్టిస్తున్నట్లు శనివారం రైల్వేకోడూరు చెక్ పోస్టు వద్ద అరెస్టు చేసిన అంతర్ రాష్ట్ర స్మగ్లర్లలో బడా స్మగ్లర్లు 10 మందిలో 6మంది బిటెక్ విద్యార్థులే ఉండటం విశేషం. సి.తేజవర్మ అనే బిటెక్ కోర్సును ముగించుకుని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన విద్యార్థులను, యువతలను మాఫియా డాన్‌లుగా తయారుచేయడంపై జిల్లా వ్యాప్తంగా మేధావులు సర్వత్రా వ్యతిరేకత వ్యక్తంచేస్తూ పోలీసు అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అటవీశాఖ, పోలీసుశాఖతోపాటు పలు శాఖల్లో అవినీతి అక్రమాలు పెట్రేగి పోతుంటే సమాజం పక్కదారి పట్టిందని అందరికీ తెలిసి సభ్యసమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగానే అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా పోలీసు జిల్లా యంత్రాంగం తాము ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టామని సంకలు గుద్దుకోకుండా యువతను మంచి మార్గంలో పెట్టి వారి బంగారు భవిష్యత్‌ను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.