కడప

పర్యాటక కేంద్రంగా పెద్ద దర్గా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 10: జిల్లాలోని పెద్దదర్గాను రాష్ట్రంలో నెంబర్ వన్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారని కలెక్టర్ కెవి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా జెడ్పి 7వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద దర్గాను మూడు ఎకరాల విస్తీర్ణంలో సుందరీకరణగా తీర్చిదిద్దుతామని, అందుకు చుట్టుపక్కల నివాస ప్రాంతమున్నవారితో త్వరలో సంప్రదింపులు చేస్తామని తెలిపారు. అలాగే హజ్‌హౌస్‌కు రూ.12కోట్లు నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయని త్వరలో టెండర్లు పిలిచి పనులను వేగవంతం చేస్తామన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి ఫల్స్ సేవా కార్యక్రమం పేరుతో ప్రతిగ్రామంలో హౌసింగ్ నిర్మాణాలపై జియోటాగ్‌తో సర్వే చేయిస్తానని గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం పరిశీలించి నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలకు త్వరలో బిల్లులు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఇసుకను తరలించుకునేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎర్రచందనం, అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని త్వరలో ఎస్పీ మైనింగ్ అధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తామన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తానని ప్రతి రైతు ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు వ్యవసాయాధికారులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో జిల్లాలోని లింగాలమండలం నెంబర్ వన్ స్థానంలో అరటిపండ్లు సాగుచేయడంలో ఉందని గుర్తుచేశారు. త్వరలో రూ.20కోట్లతో అరటి ప్రాజెక్టును జిల్లాలో నెలకొల్పుతానని అందుకు ప్రతిపాదనలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో జిల్లా రాబడి శాతం 22.8శాతం ఉందన్నారు. ఆదాయం చూస్తే 3.3శాతమే ఉందని ఇంకా 10శాతం పెంచాల్సివుందని జిల్లాలో ఉద్యానవన గ్రోత్ 12.8శాతం , పాడిపరిశ్రమల వల్ల 4శాతం ఆదాయం ఉందన్నారు.
ఉద్యాన పంటలు సాగుచేసేందుకు రైతులకు ఎన్ని మొక్కలైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఇప్పటి వరకు రైతులకు 50శాతం సబ్సిడీతోనే ఢ్రిప్ ఇరిగేష్‌ను మంజూరుచేసేవారని వాటిని 90శాతం సబ్సిడీ ఇచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ జెడి ఠాగూర్ నాయక్ మాట్లాడుతూ సూక్ష్మ పోషకాల ఎరువులను రైతులకు 50శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నామని, అలాగే జిల్లాకు రైతులకోసం 250 మినీ ట్రాక్టర్లు సబ్సిడీతో మంజూరయ్యాయని ఆసక్తిగల రైతులు వారి మండలాల్లో సంబంధిత అగ్రికల్చర్ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతి మండలానికి ప్రస్తుతం 5ట్రాక్టర్లు మంజూరయ్యాయన్నారు. కావాల్సిన రైతులకు తిరిగి రెండవ విడతలో ట్రాక్టర్లు మంజూరు చేయిస్తానని తెలిపారు.