కడప

రెండేళ్ల తర్వాత అభివృద్ధిపై చర్చ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 10: జిల్లాపరిషత్ పాలక వర్గం ఏర్పాటై రెండేళ్లుగడచినా వైకాపా పాలనలో ఉండటం, తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావడం, టిడిపికి బలం లేకపోయినా ఏ ఒక్కసమావేశం కూడా అభివృద్ధిపై చర్చ జరగకుండా అర్థాంతరంగానే ముగుస్తూ వచ్చింది. శుక్రవారం జెడ్పిసమావేశ మందిరంలో 7వ సర్వసభ్య సమావేశం జరగగా రసాభాస, అరుపులు, కేకల మధ్యసమావేశం జరిగినా టీ కప్పులో తుఫాన్ లాగా సమావేశం పూర్తిస్థాయిలో కొనసాగింది. సమావేశానికి కన్వీనర్, నూతన కలెక్టర్ కెవి సత్యనారాయణ హుందా తనంతో వ్యవహరిస్తూ అధికారపార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, జెడ్పిటిసిలకు, ప్రతిపక్షపార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పిటిసిలకు నచ్చచెబుతూ సమావేశాన్ని హుందా తనంగా నడిపించారు. ఇరుపార్టీల ప్రజాప్రతినిధులు ఒకరిపై మరకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నా ఆ ఆరోపణలపై కలెక్టర్ ఇరువర్గాలకు సమాధానం ఇస్తూ ఇరువర్గాలను శాంతపరుస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు వ్యవహరించాలని, తు.చ తప్పకుండా నిబంధనలు అతిక్రమించకుండా జిల్లా అభివృద్ధి తన ధ్యేయమని కలెక్టర్ ఇరుపక్షాలకు హితబోధచేశారు. ఆ సమయంలో వైకాపా ఎంపిలు, ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తంచేస్తూ గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కెవి రమణ ఏక పక్షంగా వ్యవహరించారని, కలెక్టర్ సత్యనారాయణ పనితీరుపై అధికార, ప్రతిపక్ష నాయకులు కితాబు ఇచ్చారు. కితాబు ఇచ్చినా ఆయన పొంగిపోకుండా తన విధి నిర్వహణలో ప్రభుత్వ నిబంధనల మేరకే వ్యవహరిస్తానని సమాధానం ఇచ్చారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జిల్లా అభివృద్ధి, జిల్లాలో చేపట్టిన పనులు, రైతు సమస్యలు, వౌళిక సదుపాయాలపైనే సమావేశాన్ని సజావుగా నిర్వహించారు. మొత్తం మీద జెడ్పి సర్వసభ్య సమావేశం రెండేళ్ల తర్వాత జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ సజావుగా నిర్వహించడం విశేషం.