కడప

చక్కెర ఫ్యాక్టరీకి తాళాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు,జూన్ 10: జిల్లాలో ఏకైక సహకార చక్కెర కర్మాగార ఫ్యాక్టరీ ఈనెల 30న పూర్తిస్థాయిలో మూసివేసి జిల్లా అధికారుల చేతుల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఫ్యాక్టరీకి ఇన్‌చార్జ్ ఎండిగా రవికుమార్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం సీజనల్ కార్మికులు 15 మంది ఫ్యాక్టరీ చుట్టు సెక్యురిటీ కాపలా ఉన్నారు. అలాగే ఎండి కార్యాలయంలో కొంతమంది సిబ్బంది ఉన్నారు. వీరందరూ ఈనెల 30వ తేదీ నుంచి ఫ్యాక్టరీ మూసివేస్తే బయటకు పంపించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. గతనెల చివరిలో జిల్లా కలెక్టర్ ఇన్‌చార్జ్ ఎండితోపాటు పలువురు సిబ్బంది ఫ్యాక్టరీ పరిస్థితిపై చర్చించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సీజనల్ కార్మికులకు నాలుగు సంవత్సరాల వేతనాలు రూ. 8కోట్లు అందాల్సివుంది. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులు, రిటైర్ అయిన వారికి రూ.8కోట్లు ప్రభుత్వం నుంచి అందాల్సివుంది. ఫ్యాక్టరీ మూతపడితే విఆర్‌ఎస్ రూపంలో కార్మికులకు రూ.30కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సివుంది. ఫ్యాక్టరీని సహకార రంగంలో నడిపించడమా లేక లీజుకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంపై చక్కెర ఫ్యాక్టరీ ఇన్‌చార్జ్ ఎండి రవికుమార్‌ను వివరణ కోరగా ఫ్యాక్టరీపై అధ్యయన కమిటీ విచారించి వెళ్లారని, ఫ్యాక్టరీ పరిధిలో ఎంత విస్తీర్ణంలో చెరకు సాగు అవుతోంది, అలాగే కో ఆప్‌రేట్ రంగంలో ఫ్యాక్టరీలో రైతులు ఎంతమంది సేల్ హోల్డర్లు ఉన్నారు, అలాగే కార్మికులు పర్మినెంట్, సీజనల్ కార్మికులు విషయంపై చర్చించడం జరిగిందన్నారు. మరో 15రోజుల్లో ఫ్యాక్టరీ విషయంపై పూర్తిస్థాయిలో నివేదిక అందనుందన్నారు. అయితే ఫ్యాక్టరీని కో ఆప్‌రేట్ రంగంలోనే నడిపేందుకు ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.