కడప

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ పోటీపై జగన్ ఆసక్తి.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 27: వచ్చే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ కోటా కింద రాయలసీమ జిల్లాల్లో ప్రముఖ విద్యాసంస్థల అధినేత, జిల్లాలోని అత్యధికంగా ఉన్న రాజు విద్యాసంస్థలకు చెందిన చమర్తి జగన్మోహన్‌రాజు దృష్టి పెట్టినట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. జగన్మోహన్‌రాజు కుటుంబం తొలి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నా పార్టీలో న్యాయం జరగకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం ఆయన టిడిపి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దివంగత నేత ఆర్.రాజగోపాల్‌రెడ్డి కుమారులైన టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), మాజీ ఎమ్మెల్యే, రాయచోటి ఆ పార్టీ ఇన్‌చార్జ్ ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి సోదరులే తన రాజకీయ భవిష్యత్ నిర్ణయిస్తారని జగన్‌తోపాటు ఆయన అనుచరులు భావిస్తున్నారు. జగన్ తండ్రి సి.సుబ్బరాజు ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐఓగా, ఆయన సోదరుడు రాయచోటి శిబ్యాల గ్రామపంచాయతీ సర్పంచ్‌గా టిడిపి తరపున రెండు పర్యాయాలు కొనసాగారు. క్షత్రియులు సామాజిక వర్గానికి చెందిన రాజంపేట, రాయచోటి, కడప నియోజకవర్గంలోని ప్రముఖులంతా తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై వత్తిడి తీసుకురావాలని ఉన్నా జగన్ మాత్రం ఆర్‌ఆర్ సోదరుల నిర్ణయమే తన నిర్ణయమని ఢంకా పథంగా చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవలే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లాలో ముందంజలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్‌రాజు ఒకరే జిల్లా వ్యాప్తంగా 5వేల మంది గ్రాడ్యుయేట్స్‌ను చేర్పించేందుకు సర్వశక్తులు వడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఆయన విద్యాసంస్థల్లో పనిచేసే గ్రాడ్యుయేట్స్, ఆయన విద్యాసంస్థల్లో చదివి గ్రాడ్యుయేట్స్‌గా ఎదిగిన విద్యార్థులు 5వేల మంది పైబడే ఉన్నారు. ఇప్పటికే స్వచ్చందంగా ఆయన సంబంధీకులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. మొత్తం మీద గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున రంగంలో దింపేందుకు ఆ పార్టీలోని ప్రముఖ నేతలు, జిల్లాలోని గ్రాడ్యుయేట్స్, క్షత్రియ సామాజికవర్గం ఉబలాటలో ఉన్నారు. అయితే జగన్మోహన్‌రాజు మాత్రం తాను ఆర్‌ఆర్ సోదరుల ఆదేశాలే తనకు శిరోధార్యం అని ప్రకటించారు. గతంలో జగన్మోహన్‌రాజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే లోక్‌సత్తా పార్టీ తరపున రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసి రాయచోటి ప్రాంతంలో అనేక సమస్యలపై కాంగ్రెస్‌పార్టీపై రాజీలేని పోరాటం కొనసాగించి అనేక సమస్యలు పరిష్కరించారు. ఈ నేపధ్యంలో జగన్మోహన్‌రాజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద ఎంపిక చేసేందుకు ఆయన శ్రేయోభిలాషులు , తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.