కడప

రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓఎస్‌డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 14: ప్రమాదవశాత్తు గువ్వల చెరువుఘాట్‌రోడ్డులోని 200 అడుగుల లోయలో పడ్డ బస్సును పోలీసుల అపన్నహస్తం, రెస్క్యూ ఆపరేషన్‌లో స్వయంగా పాల్గొన్న ఓఎస్‌డి సత్యయేసుబాబు కడప డిఎస్పీ అశోక్‌కుమార్, స్పెషల్‌పార్టీ బృందం సకాలంలో క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. గువ్వలచెరువుఘాట్‌రోడ్డు మూడవ మలుపువద్ద బెంగళూరు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురై 200 అడుగుల లోయలో పడిపోయింది. దీంతో కండక్టర్ రత్నయ్య (50), మరో ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 35 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఎక్కువ మంది రాజంపేట వాసులుగా తెలుస్తోంది. సమచారం తెలిసిన వెంటనే పోలీసులు స్పందించి ఆపన్నహస్తం అందించడంతో పలువురికి ప్రాణాపాయం తప్పింది. ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఆధ్వర్యంలో ఓఎస్‌డి (ఆపరేషన్స్) బి.సత్యయేసు బాబు ,కడప డిఎస్పీ ఇజి అశోక్‌కుమార్, కడప రూరల్ సిఐ బివి శివారెడ్డి, సికెదినె్న ఎస్‌ఐ కుళాయప్ప, స్పెషల్‌పార్టీ పోలీసుల బృందం హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108వాహనంలో రిమ్స్‌కు తరలించి వైద్యసహాయాన్ని చేయించారు. అలాగే పలువురు బాధితులను బస్సులో నుంచి అతి కష్టంమీద భయటకు తీసి వారికి తక్షణ వైద్యసేవలు అందేలా చూడటంతో ప్రాణాపాయం తప్పిం ది. సమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి వారు తెచ్చిన సామాగ్రితో జాకీలు పెట్టి బస్సును పైకి లేపినందువల్ల బస్సు కింద తీవ్రగాయాలతో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాన్ని రక్షించారని ఎస్పీ తెలిపారు. రిమ్స్‌లో క్షతగాత్రులను ఆర్డీవో చిన్నరాముడు, ఆర్టీసీ ఆర్‌ఎం గోపీనాధ్‌రెడ్డితోపాటు పలువురు ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. కాగా ఈ ఏడాది మార్చి 14న ఈఘాట్‌లోనే ఇదే మలుపు వద్ద జరిగిన లారీ ప్రమాదంలో ఐదుమంది మరణించారని, 32 మంది గాయపడ్డారని ఎస్పీ గుర్తు చేశారు. ఈనెల 15న కడప డిఎస్పీ, ట్రాఫిక్ డిఎస్పీ, డిటిసి, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఘాట్‌లో దుర్గటన జరిగిన మలుపు వద్ద జాయింట్ సర్వే చేయిస్తామన్నారు. ఇక మీదట అక్కడ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.