కడప

కాపులకు వ్యతిరేకం కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 14: రాష్ట్ర మాజీ మంత్రి, కాపుల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్షను చేపట్టిన నేపధ్యంలో తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ముద్రగడ వర్గీయులు మంగళవారం రాయచోటికి చేరుకుని మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నేత ఎస్.పాలకొండ్రాయుడు, జెడ్పి మాజీ చైర్మన్ ఎస్.బాలసుబ్రహ్మణ్యంను అత్యంత గోప్యంగా కలుసుకున్నట్లు సమాచారం. అయితే ఆ నేతలు ముద్రగడ చేపడుతున్న దీక్షలకు మద్దతు ఇవ్వాలని తండ్రి, తనయులను కోరారు. వారితో పాలకొండ్రాయుడు సంభాషిస్తూ కాపు సామాజికవర్గానికి పెద్దపేట వేసేందుకు కాపులను అన్ని విధాల ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఎన్నికల హామీని అమలుచేస్తున్నారని ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు కాపుల కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.1500కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం కాపుల సంక్షేమం కోసం పాటుపడటం, ఎంతో అభినందించ దగ్గ విషయమని అయితే రాష్ట్ర విభజన, నూతన రాజధాని నిర్మాణం వంటి సమస్యలతో సతమతవౌతున్న చంద్రబాబునాయుడు కాపులకోసం ప్రత్యేక శ్రద్ధ చూపడం ఎంతో అభినందించదగ్గవిషయమన్నారు. నాడు ఎన్‌టిఆర్, నేడు బాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే తన ధ్యేయమని, అధికార దాహంతో తాను నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారం కోసం ఎంతోమంది వలస పక్షులు తన మాతృపార్టీకి వస్తూ పోతుంటారని అధికారం కోసం కానీ, సంపాదన కోసం గానీ తాను ఎన్నడూ ఆశపడలేదని తెలుగుదేశంపార్టీ అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిమతం, ఆశయాలు , ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా తాను పాటుపడతానని తాను మరణించినా తెలుగుదేశంపార్టీ జెండా కప్పుకుని మరణిస్తానని, వలస పక్షులను బాబునే వేటాడాలని ఆయన సూచించారు. అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ జిల్లాల నుంచి వచ్చిన కాపు నేతలతో ఆయన కుమారుడు జెడ్పి మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యంతో చర్చలు జరుపుతూ తమ ప్రత్యర్థులు రాజకీయ లబ్దికోసం తమ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలుతున్నారని, ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష న్యాయసమ్మతమైతే తాను మద్దతు ఇస్తానని తన కుటుంబం నాటికీ నేటికీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణగా వ్యవహరిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌బాబు కాపు జాతికోసం అహర్నిశలు కృషి చేస్తుంటే కేవలం ముద్రగడ పద్మనాభం ఇతర పార్టీలు, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ప్రభుత్వంపై బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన్ను కలిసిన నేతలకు స్పష్టం చేశారు. పార్టీ కేడర్ విషయంలో జిల్లా కేడర్‌కు న్యాయం చేయాలని తాను బహిరంగంగా మాట్లాడానని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చానని తనకు షోకాజ్ నోటీసు ఇచ్చారని ఈనేపధ్యంలో ముద్రగడ అనుచరగణం తనతో సంప్రదించడం ఏ మాత్రం భావ్యం కాదని తన ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆయన ముక్తకంఠంతో తెలుపుతూ ఒక దశలో ఆయన్ను కలిసిన ముద్రగడ అనుచరులను అసహనం వ్యక్తం చేసి, కాంగ్రెస్‌పార్టీ పాలనలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఇతర నాయకులు ఏమి చేశారని ప్రశ్నిస్తూ వారిపై విరుచుకుపడినట్లు తెలిసింది. దీంతో అక్కడి నుంచి వారు నిష్క్రమించారు.