కడప

ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్), జూన్ 17:నిత్యావసర ధరలను అదుపుచేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ నగర అధ్యక్షుడు బండి జక్యరయ్య పేర్కొన్నారు. స్థానిక ఇందిరా భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ పక్క నిత్యావసర ధరలు పెరుగుతుంటే , మరో పక్క కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ధరలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమన్నారు. కావున రైతుల వద్ద నుంచి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీ రూపంలో ధరలు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాగే ధరలు ఉంటే సామాన్యుడు కడుపునిండా తిండి కూడా తినలేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ధరలను అదుపుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పులివెందుల కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జి శ్రీనివాసులురెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు తిరుమలేష్, డిసిసి ఉపాధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి, బుజ్జిబాబు, మల్లికార్జునయాదవ్, మహేంద్ర పాల్గొన్నారు.