కడప

జిల్లాలో ఆలస్యంగా మొదలైన వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 23:గతవారం రోజులుగా జిల్లాలో నైరుతి రుతుపవనాల్లో భాగంగా వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అయితే ఈ వర్షాలు నమ్ముకుని మెట్టప్రాంతాల్లో వేరుశెనగ విత్తనాలు ,ప్రొద్దుతిరుగుడు విత్తనాలు విత్తుతున్నారు. జిల్లాలోని బి.కోడూరు మండలంలో 56.1మి.మీ, చిన్నమండెం మండలంలో 62.8మి.మీ, చెన్నూరు మండలంలో 60మి.మీ, చింతకొమ్మదినె్న మండలంలో 41.6మి.మీ, చిట్వేలులో 42.3మి.మీ, కడపలో 53.4మి.మీ, దువ్వూరులో 25.4మి.మీ, కలసపాడు 20.8మి.మీ, రైల్వేకోడూరు 23.7 మి.మీ, ముద్దనూరు 20.3మి.మీ, ఓబులవారిపల్లె 29.7మి.మీ, పోరుమామిళ్ల 33.5మి.మీ చొప్పున వర్షం కురిసింది. ఈనేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే ఖరీఫ్‌సీజన్ ప్రారంభంలో వర్షం కురిసిన పంటల దిగుబడి సమయంలో వర్షాలు రాకపోవడంతో పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రావన్న ఉద్దేశ్యంతో రైతులు వరుణుడిపై ఆశలుపెట్టుకుని ఇప్పటికే గాలిలో దీపం పెట్టుకుని సాగుచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కూడా ముచ్చటగా మూడో ఏడాది జిల్లా రైతాంగాన్ని కరవును వెంటాడే పరిస్థితులు లేకపోలేదు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాయలసీమ జిల్లాల్లో కడపను ప్రధమస్థానంలో తీసుకొస్తామని సాక్ష్యా త్తు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రకటించారు. అయితే జిల్లాలో వర్షాన్నినమ్ముకుని మెట్టప్రాంతం సాగుచేసుకుంటున్న రైతాం గం వరుణిడి దేవుడి కరుణ కటాక్షాల కోసం నిరీక్షిస్తున్నారు.