కడప

గుర్తు తెలియని యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,జూన్ 30:మండలంలోని దుంపలగట్టు సమీపంలో ఉన్న కెఎంసి వద్ద తూముకింద గుర్తు తెలియని యువకుడి (25) శవాన్ని స్థానికులు కనుగొన్నారు. కడప -కర్నూలు జాతీయ రహదారి కెఎంసి సమీపాన కల్వర్టు కింద యువకుడి శవంపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఆనవాళ్లను స్థానిక పశువుల కాపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఖాజీపేట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులు పరిశీలిస్తే యువకుడిని చంపి మొఖంపై పెట్రోలు పోసి తగులబెట్టారా యువకుడే విరక్తిచెంది పెట్రోలు పోసుకుని కాల్చుకున్నాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. శవాన్ని పరిశీలిస్తే మూడురోజుల క్రితమే చనిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పట వరకు స్థానికులు ఎవ్వరూ తమ వ్యక్తి కన్పించడం లేదన్న ఫిర్యాదులు పోలీసులకు అందలేదు. దీన్ని బట్టి మృతుడు స్థానికేతరుడై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

సెల్‌టవర్ల బ్యాటరీల దొంగలు అరెస్టు
జమ్మలమడుగు, జూన్ 30: రిలయన్స్ కంపెనీకి చెందిన సెల్‌టవర్ల బ్యాటరీల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక అర్బన్ స్టేషన్‌లో గురువారం సిఐ శ్రీనివాసులు నిందితులను, చోరీకి గురైన బ్యాటరీలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాటరీలు చోరీకి గురైన విషయంపై ఈ నెల 22వ తేదీన రిలయన్స్ కంపెనీకిచెందిన సాంకేతిన నిపుణుడు పోట్లదుర్తి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. విచారణలో తాళ్లమాపురానికి చెందిన టి.పవన్‌తో పాటు కడపకు చెందిన ఇమామ్ అనే ఇరువురిని అదుపులోనికి తీసుకొని విచారించామన్నారు. మొత్తంగా రూ.10లక్షలు విలువ జేసే 48బ్యాటరీలు చోరీకి నిందితులు పాల్పడ్డారన్నారు. అయితే వాటిని రూ.4లక్షలు అమ్ముకున్నట్లు తేలిందన్నారు. బ్యాటరీల కొనుగోలుకు సంబందించి మధ్యవర్తిగా వ్యవహరించిన సంధాని అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న బ్యాటరీలను కోర్టుకు స్వాధీనం చేయనున్నామని అర్బన్ సిఐ శ్రీనివాసులు తెలిపారు.