కడప

ఎమ్మెల్సీ పదవుల కోసం టిడిపి అధిష్టానం సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 3: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఆయన ప్రాబల్యాన్ని తగ్గించేందుకు తెలుగు అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. జిల్లాలో అధికారపార్టీ నేతల పనితీరు బేరీజు వేసి పదవులు కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించడంతో జిల్లా రాజకీయాల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకోనున్నాయి. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ పదవులను సుదీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. నిరాశ,నిస్పృహలతో సీనియర్ నేతలు ఇతరపార్టీలోకి జంప్‌కాకుండా ఉండేందుకు రెండు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ రాజీనామాతో మంత్రి పి.నారాయణకు చాన్స్ లభించింది. ప్రస్తుతం జిల్లాలో ఎమ్మెల్సీగా ఉంటున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ తరపున ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న చంగల్రాయులు, సి.రామచంద్రయ్యలకు పదవీ విరమణ గడువు సమీపిస్తోంది. వారి స్థానంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలకే ఎమ్మెల్సీ చాన్స్ దక్కే అవకాశాలున్నాయి. అయితే వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే సత్తా కలిగిన నేతలకే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ గత నెలలో జిల్లా పర్యటనకు వచ్చినపుడు ఆధిపత్యపోరు ఉన్న నియోజకవర్గాల్లో నేతలు 45రోజుల్లో తమ పంథాను మార్చుకుని కలిసికట్టుగా పనిచేయాలని, పనిచేసే వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వెళ్లారు. 45రోజులు గడువు సమీపిస్తుండటంతో ఇప్పటికే లోకేష్ తనకున్న నెట్‌వర్క్ ద్వారా జిల్లాలో నేతల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు రానుండటంతో ఈలోగా లోకేష్ వర్గవిభేదాలపై తండ్రికి నివేదిక ఇస్తారని సమాచారం. రాష్ట్ర మాజీ మంత్రి, జమ్మలమడుగు టిడిపి ఇన్‌చార్జి పి.రామసుబ్బారెడ్డి, డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి, మైనార్టీ నేతల్లో ఇద్దరు, 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశించి భంగపడిన వారిలో కొంతమంది పేర్లను టిడిపి అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో జగన్‌ను దీటుగా ఎదుర్కోగల సత్తా ఉన్న వారికే ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.