కడప

విలువలతో కూడిన జీవితం సమాజానికి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 30:విలువలతో కూడి న జీవితం మంచి సమాజానికి దారి చూపుతుందని, సంపాదనే ధ్యే యంగా పెట్టుకుంటే సమాజం, జీవి తం రెండు వినాశనానికి కారణమవుతాయని యోగివేమన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య భేతనభట్ల శ్యాంసుందర్ పిలుపునిచ్చారు. గురువారం వైవియులో పదవీ విరమణపొందిన కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జయగోపాల్ గౌడ్‌కు ఏర్పాటుచేసిన వీడ్కోలు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైలు ప్రయాణం లాంటి జీవనయానంలో వ్యక్తి జీవితం ఎంతోమందితో కలిసి ప్రయాణం చేస్తుందని అందర్నీ కలుపుకుంటూ ప్రతి వ్యక్తి లక్ష్యసాధన వైపు నడవాలని సమాజంలో ప్రతి ఒక్కరు ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించినప్పుడే అటువంటి వ్యక్తులు గొప్పవ్యక్తి, శక్తిగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగే ప్రతి ఒక్కరూ నిత్యవిద్యార్థి తరహాలో సమాజంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుని బోధన చేయాలని ఆయ న కోరారు. అలాగే రెక్టార్ ఆచార్య ధనుంజయ నాయుడు మాట్లాడుతూ జయపాల్ గౌడ్‌తో తనకు 40సంవత్సరాల సుదీర్ఘసన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన మనస్థత్వం , ఆయన బోధనలు, ఆయన పరిశోధనలపై ఎంతోమంది విద్యార్థులను ఉ న్నత ప్రయోజకులుగా తీర్చిదిద్ది మంచి పేరు ప్రఖ్యాతులు గడించడం జయగోపాల్‌కే చెందుతుందని ఆయ న సేవలను కొనియాడారు. అనంతరం కులసచీవులు డా.వై.నజీర్ అహ్మద్ మాట్లాడుతూ జయగోపాల్ గౌడ్ ఓర్పు, నేర్పు, స్నేహతత్వంతో రాజీలేని పోరాటం చేస్తూ విద్యాబోధనలు చేయడం ఆయనకే సాటి అని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా.కె.గంగయ్య మాట్లాడుతూ జయగోపాల్ గౌడ్ సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తూ తన ఉద్యోగంలో ఎటువంటి మచ్చలేకుండా పదవీ విరమణ చేయడం జరిగిందన్నారు. వ్యాయామ అధ్యాపకులు డా.రామసుబ్బారెడ్డి, వైవియు అధ్యాపక సంఘం ప్రధానకార్యదర్శి డా.వైసి వెంకటసుబ్బయ్య, డా.గులామ్ తారీఖ్, డా.విజయరాఘవప్రసాద్, డా.పార్వతి, ఆచార్య సి.శ్రీనివాస్, డా.వై.సుబ్బరాయుడు, డా.విజయభారతి, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొని జయగోపాల్‌గౌడ్ సేవలు కొనియాడుతూ ఆయన విద్యార్థులకు, విశ్వవిద్యాలయానికి అందించిన సేవలపై ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతి ఒక్కరు జయగోపాల్‌ను ఆదర్శంగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. అధ్యాపక సంఘం సం యుక్త కార్యదర్శి డా.మృత్యుంజయరావు వందన సమర్పణ చేశారు. జయగోపాల్‌గౌడ్ ప్రసంగిస్తూ ఆయన విధి నిర్వహణపై సభాముఖంగా చెబుతూ సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.