కడప

నేడు ‘బడీరాత్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)జూలై 1:ఏకేశ్వరుడైన అల్లాహ్ భూమిపైనున్న ప్రజలకు దివినుంచి పవిత్ర ఖురాన్‌ను అందజేసిన దినమే బడీరాత్‌గా చెప్పబడింది. ఆరోజు రాత్రంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక చింతనతోనే గడుపుతారు. ఏడాదికొకసారి వచ్చే ముస్లిం సోదరుల ప్రధానమైన పండుగ 3రంజాన్2. రంజాన్‌నెలలో ఆమాసమంతా ఉపవాసాలు పాటిస్తారు. ఆ ఉపవాసాల ఆఖరి ఘట్టమే 3బడీరాత్2 (పెద్దరాత్రి). ఈనేపధ్యంలో బడీరాత్‌ను జిల్లా ప్రజలు శనివారం జరుపుకోబోతున్నారు. బడీరాత్ తర్వాత కేవలం కొన్నిరోజుల్లో పండుగ నిర్వహించుకునే 3ఈదుల్‌ఫితర్2 వస్తుంది. బడీరాత్‌కు ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆరాత్రి చిన్నా పెద్దా అందరూ వారి వారికి అందుబాటులోని మసీదులకు వెళ్తారు. ప్రత్యేక నమాజులను బాగా రాత్రి గడిచే వరకు చేస్తారు. తర్వాత ఆయా మసీదుల ఇమామ్‌లు బడీరాత్ ప్రాముఖ్యతను తెలియజేస్తారు. బడీరాత్ విశేషం ఏమిటంటే ఆరోజు రాత్రి ఎంతసేపు ఓపికగా మేల్గొని ఉండి నమాజులు చేస్తే అంతపుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆరోజు దైవం ఏడు ఆకాశాల దిగువన వచ్చివుండి స్వయంగా తన భక్తుల కోర్కెలను ఆలకిస్తారని విశ్వసిస్తారు. ఈకారణంగా బడీరాత్ రోజున ముస్లింలందరు మసీదులకు హాజరు అవుతారు. బడీరాత్ రోజున కొత్త బట్టలు ధరిస్తారు. అలాగే చాలామంది ముస్లింలు బడీరాత్ కంటే ముందే మత విధి అయిన స్వచ్చంధ ఆదాయపన్ను- 3జకాత్2 చెల్లిస్తారు. తమ తమ ఆస్తిపాస్తులపై సూచించిన విధంగా స్వచ్చంధ పన్నును విధించుకుంటారు. ఆ మొత్తాన్ని తమ బంధువర్గంలోని పేదలకు, అనాధ ఆశ్రమాలకు అలాగే తమ ముస్లింలలో పేదలకు అందజేస్తారు. అంతేగాక ప్రతి ముస్లిం చిన్నా, పెద్దా పేరిట 3్ఫత్రా2 కూడా ఇస్తారు. ఆ మొత్తం ఇంత మొత్తంగా నిర్థారిస్తారు. ఫిత్రా అంటే ఒక ఏడాది పాటు దైవకృపతో జీవించి ఉన్నందుకు ఇచ్చే మూల్యం. దీనిని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేరుతో చాలా పేదలైన వారికి అందిస్తారు.