కడప

అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 4: విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు నిరక్ష్యరాస్యత, నిరుద్యోగం, పేదరికం, హింసలపై పోరాటం చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కళాక్షేత్రంలో 120వ అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి కలెక్టర్ కెవి సత్యనారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అల్లూరిసీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విప్లవ జ్యోతి అల్లూరిసీతారామరాజు మన్యం వాసుల కష్టాలను కడతేర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కొనడానికి గిరిజనులకు అండగా నిలచి పోరాటం చేసిన ఘనత ఆయనదే అన్నారు. గిరిజనులకు వారి హక్కులను వివరించి వారిలో చైతన్యం, ధైర్యాన్ని పెంపొందించేందుకు అల్లూరి సీతారామరాజు కృషి చేశారన్నారు. అన్యాయాలను ఎదురించే విధంగా గిరిజనులను తయారుచేశారన్నారు. భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించి మనదేశ సంపదను దోచుకుంటూ మనమీదనే పెత్తనం చెలాయించడాన్ని ఎదుర్కొన్నారన్నారు. గిరిజన హక్కులను హరించి కనీసం వ్యవసాయం చేసి పంటలను పండించేందుకు కూడా ఆంగ్లేయులు ఆంక్షలు విధించారన్నారు. ఆంగ్లేయులకు ఆ హక్కులను ఎవరిచ్చారని వారిపై అల్లూరు సీతారామరాజు పోరాటాలు చేయడం జరిగిందన్నారు. మనం ఇప్పుడు చదువులేని పిల్లలకు, పెద్దలకు చదువుచెప్పాలని ఒకరి నుంచి మరొకరికి విద్యను బోధించి నిరక్ష్యరాస్యతను పారద్రోలాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నతమైన విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మరో పది మందికి ఉపాధి కల్పించాలన్నారు. పేదరిక నిర్మూలనపై పోరాటాలు చేసి దేశంలో పేదరికం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. హింసను రెచ్చగొట్టేవారి నుంచి దూరంగా ఉండాలని వారిని అదుపులో ఉంచేందుకు హింసపై పోరాటం చేయాలన్నారు. మతద్వేషాలు, హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని ఉద్యమం చేయాలన్నారు. ముఖ్యంగా 120వ అల్లూరి సీతారామరాజు జయంతికి విద్యార్థులందరూ అల్లూరిసీతారామరాజు వేషధారణలో వచ్చారని ఇది సంతోషించదగ్గ విషయమన్నారు. అలాగే ఆయన భావాలు, ఆయన విధానాలు ఆచరించాలని కోరారు. అల్లూరిసీతారామరాజు చెప్పిన విధంగా తన రక్తపుబొట్టు వెయ్యిమంది సీతారామరాజులు పుడతారని అన్న మాటలు అవి నిజంగా కన్పిస్తున్నాయని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ ఆయన వ్యక్తికాదని ఒక మహాశక్తిని కొనియాడారు. 1897లో పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించి 26సంవత్సరాలకే అన్యాయాలను ఎదిరించేందుకు ఉద్యమకారునిగా ఎదిగారని పేర్కొన్నారు. తొలుత మన్యం దొర అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అల్లూరిసీతారామరాజు వేషధారణలో స్థానిక స్టేట్ గెస్టుహౌస్ నుంచి కళాక్షేత్రం వర కు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో డిఇఓ ప్రతాప్‌రెడ్డి, మెప్మా పిడి వెం కటసుబ్బయ్య, ఆర్డీవో చినరాముడు, ఎంఇఓ అధికారులు పాల్గొన్నారు.