కడప

రాయలసీమపై వివక్ష చూపుతున్న సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు టౌన్, జులై 4: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రాంతంపై వివక్షత చూపుతున్నాడని ఉక్క్ఫ్యుక్టరీ సాధనసమితి అధ్యక్షుడు జివి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక శ్రీవిద్యా, భావనా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు అభివృద్ధి అంతా కోస్తాకే పరిమితం చేస్తున్నారని, రాయలసీమలో కనీసం చిన్నపాటి పరిశ్రమల స్థాపనకు కూడా పూనుకోవడం లేదన్నారు. కోస్తా వారికి రొయ్యల చెరువులు కేటాయించి, రాయలసీమ వారికి ఇంకుడుగుంతలు తవ్విస్తున్నారన్నారు. ఇంకుడుగుంతలను దోమలు తమ స్థావరాలుగా చేసుకొని మనపై దాడిచేసేందుకు సిద్ధంగా వున్నాయన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా ఉపయోగపడేటువంటి ఉక్కు పరిశ్రమను స్థాపించాలని ఆయన అన్నారు. పరిశ్రయ ద్వారా జిల్లాలో ఎన్నో ఉప పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు వెలుస్తాయని, ఈ ప్రాంతమంతా పారిశ్రామిక హబ్‌గా మారుతుందన్నారు. తద్వారా జిల్లాలో నిరుద్యోగ సమస్యతోపాటు నిరుద్యోగ, రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు తెలుసుకొని ఉక్కు పరిశ్రమ స్థాపనకై పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరముందన్నారు. విద్యార్థులు తలుచుకుంటే రాజకీయ నాయకులు వారి ఇళ్లకే పరిమితమవుతారని, జిల్లాలోని ప్రతి విద్యార్థి బాగా ఆలోచించి స్థానిక సమస్యలను తెలుసుకోవడంతోపాటు పరిశ్రమ స్థాపనకు కృషి చేయాల్సిన బాధ్యత మీపై వుందన్నారు. విదేశాలలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడి పారిశ్రామికవేత్తలను పిలిచి పెట్టుబడులు పెట్టిస్తున్నారని, అలాగే ఉక్కుపరిశ్రమపై పక్కా ప్రణాళికతో కూడిన సమాచారాన్ని వారికి అందజేసి, సరిపడా నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకొని ఒక శే్వత పత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరముందన్నారు. జిల్లాలో ఉక్కుపరిశ్రమకు అన్ని వనరులు పుష్కలంగా వున్నాయని, పరిశ్రమను స్థాపించినట్లయితే జిల్లాలోని రైతులు సంవత్సరానికి మూడుకార్లు పంటలు పండించుకొనే భాగ్యం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఉక్కు పరిశ్రమ ప్రచార కార్యదర్శి ఖలందర్, ప్రముఖ విద్యావేత్త అమర్‌నాథ్‌రెడ్డి, కళాశాలల కరస్పాండెంట్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.