కడప

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, జూలై 7:మండలంలోని రాఘవరాజుపురం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన్న సుబ్బరత్నమ్మ (60) రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ఆమె మృతి చెందింది. ఆమెకు భర్త సుబ్రమణ్యంతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. జరిగిన సంఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రైలు క్రింద పడి యువకుని మృతి
ఒంటిమిట్ట, జూలై 7:ఒంటిమిట్ట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద మాధవరం ఒన్‌కు చెందిన శివ (25) అనే యువకుడు మృతి చెందాడు. యువకుని మృతికి కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
జూదరుల అరెస్టు
వీరబల్లి, జూలై 7:మండల పరిధిలోని సంగంవాండ్లపల్లె గ్రామ పంచాయతీలోని సంగంవాండ్లపల్లె సమీపంలో గురువారం ఐదు మంది జూదరులను అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ రామక్రిష్ణ తెలిపారు. వివరాలలోకి వెళ్లితే.. గురువారం జూదమాడుతున్నట్లు ముందుగా అందిన సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు నిర్వహించి సంగంవాండ్లపల్లె సమీపంలో జూదమాడుతుండగా ఐదు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.2,390 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మండల పరిధిలో ఏ ప్రాంతంలోనైనా జూదం, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తద్వారా అసాంఘిక శక్తులపై దృష్టి సారిస్తామన్నారు.