కడప

బంగారంతో ఉడాయించిన నకిలీ జ్యోతిష్యుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జూలై 7: రాజంపేటలో ఓ మహిళను మోసంచేసి బంగారంతో ఉడాయించిన తండ్రి కొడుకులైన ఇద్దరు దొంగ జ్యోతిష్యులను గురువారం తిరుపతిలో అరెస్టుచేసినట్టు డిఎస్పీ ఎ.రాజేంద్ర గురువారం విలేఖరులకు తెలిపారు. ఈ బంగారు విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉం టుందని తెలిపారు. అరెస్టుచేసిన వారిలో పస్టమ్ క్రిష్ట అలియాస్ క్రిష్ణంరాజు, హుస్సేన్‌లున్నారు. వివరాల్లోకి వెళితే ఆరు నెలల క్రితం పస్టమ్ క్రిష్ణ, హుస్సేన్‌లు రైల్వేస్టేషన్ రోడ్డులో ఒక జ్యోతిష్యాలయం నడుపుతూ వచ్చా రు. రైల్వేస్టేషన్ రోడ్డులోని శ్రీలత అనే యువతి కుటుంబ కలహాలు, ఇతరత్రా సమస్యలు పరిష్కారం కోసం వీరి వద్దకు రెండు నెలల క్రితం వచ్చి సంప్రదించడంతో పస్టమ్ క్రిష్ణ మీ ఇంట్లోని బంగారులో దుష్టశక్తి చేరిందని, ఈ దుష్టశక్తిని బయటకి పంపించేస్తే మీ కష్టాలు, సమస్యలు తీరతాయని చెప్పడంతో ఆ యువతి నమ్మి బంగారు తీసుకొచ్చి క్రిష్ట చేతికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ దుష్టశక్తిని బంగారు నుండి బయటకి పంపించేందుకు తన శక్తిచాలడం లేదని, తన గురువును సంప్రదించాలని చెప్పి, తన కొడుకు హుస్సేన్‌నే గురువుగా చెప్పి మాట్లాడించడంతో మరో 30వేల రూపాయల నగదు కూడా ఆ యువతి తెచ్చి ఇవ్వడం జరిగింది. దుష్టశక్తిని తొలగించేందుకు కొంత సమయం పడుతుందని చెప్పడంతో పూర్తిగా వీరి మాటలు నమ్మిన యువతి బంగారు వీరికి ఇచ్చేయడం జరిగింది. ఆ తరువాత బంగా రు, నగదుతో ఈ తండ్రికొడుకులు ఉడాయించడం జరిగింది. జ్యోతిష్యులు కానరాకపోవడంతో కొద్దిరోజుల తరువాత మోసపోయానని తెలుసుకున్న ఈ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి గాలింపుచర్యలు చేపట్టి ఈ ఇద్దరు దొంగ జ్యోతిష్యులను తిరుపతిలో పట్టుకొని అరెస్టుచేయడం జరిగింది. దీనిపై డిఎస్పీ రాజేంద్ర, సిఐ మోహన్‌క్రిష్ణలు మాట్లాడుతూ జ్యోతిష్యులు, దొంగ బాబాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని, బంగారు, నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. దొంగ బాబాల పేరుతో మోసంచేసే వారి విషయం తమ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.