కడప

సారారహిత జిల్లాగా మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 4: జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చేందుకు రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లాకలెక్టర్ కెవి రమణ సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖాధికారులతో నవోదయం కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ప్రతినెలా నవోదయపై లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటిని పూరించేందుకు వివిధశాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రేమ్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 87 గ్రామాలను ప్రొహిబిషన్ , ఎక్సైజ్ శాఖ దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో అధికారులు తరచూ సందర్శించి నాటుసారా తయారుచేయడం, రవాణా, విక్రయించడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 14 గ్రామాలను సారారహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. శాఖాపరంగా తనిఖీలు చేసి నాటుసారా తయారీ, విక్రయించే వారిపై కేసులు నమోదుచేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా నవోదయ కార్యక్రమంపై విస్తృతప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నామని, పోలీసు,రెవెన్యు , ఇతర ప్రభుత్వశాఖల సమన్వయంతో జిల్లాను సారారహిత జిల్లాగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మార్చినెలాఖరుకు 286 బైండోవర్‌కేసులు నమోదు చేయడం జరిగిందని, 43 మందిని అరెస్టుచేసి కేసులు నమోదు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో డిఎస్‌పి నాగేంద్రుడు, ప్రొహిబిషన్ ,ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ విజయకుమారి, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు శ్రీనివాసాచారి, విజయశేఖర్, కడప, రాజంపేట డిఆర్వోలు చినరాముడు, ప్రభాకర్ పిళ్లై తదితరులు పాల్గొన్నారు.