కడప

రాయలసీమకు సాగు నీరందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(రూరల్)జూలై 11: రాయలసీమకు జలాలు వచ్చి రైతులందరూ పచ్చగావుండేందుకు, స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రజలంతా నడుంబిగించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ ఆవరణలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి , వంగాల సిద్దారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, భారతీయ జనాతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాథరెడ్డిలు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పడి నుంచి రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతూనే వస్తోందన్నారు. అది కూడా రాయలసీమ నాయకుల పాలనలోనే అని వారు పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారాకానీ పోలవరం ద్వారా కానీ ఆదా అయ్యే కృష్ణానికర జలాలను రాయలసీమకు చట్టబద్దత కల్పించాలన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండే విధంగా జీవోను సవరించాలన్నారు. గతంలో సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై కృష్ణపెనే్నరుప్రాజెక్టును విస్మరించి రాయలసీమకు అన్యాయం చేసినందుకు పరిహారంగా ఎంతోకొంత మేలు రాయలసీమకు చేకూర్చి సిద్దేశ్వరంవద్ద అలుగు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమలో అసంపూర్ణంగా ఉన్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కెసి కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకై పాలనా అనుమతులు పొందిన గండ్రేవుల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే రాజోలి ఆనకట్ట సామర్థ్యాన్ని 3టిఎంసిలకు పెంచాలన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు, జెడ్పి మాజీ ఉపాధ్యక్షుడు జి.లక్ష్మిరెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, కడప జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు మాధవరెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు విశ్వప్రకాష్‌నాయుడు, కెసి కెనాల్ ఆయకట్టు మాజీ అధ్యక్షుడు చంద్రవౌళీశ్వరరెడ్డి, కిసాన్ సంఘ్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.