కడప

ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,జూలై 12: ప్రజలకు సేవచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని మైదుకూరు నియోజకవర్గం ఇన్‌చార్జి, టిటిడి పాలక మండలి సభ్యులు పుట్టాసుధాకర్‌యాదవ్, టిడిపి రాష్టన్రేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డిలు అన్నారు. మండలంలోని పత్తూరు దళితవాడ, సీతానగరం గ్రామాల్లోని 60 కుటుంబాల కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. సీతానగరం నుంచి తుపాకుల గంగిరెడ్డి సోదరులు, పత్తూరు దళితవాడ నుంచి ప్రకాశం, ఏసన్న, రత్నస్వామిల ఆధ్వర్యంలో పుట్టా, రెడ్యంల సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. వచ్చిన నేతలందరికీ విందు ఏర్పాటుచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే వెళ్లిపోతానని చాలా మంది ఊహించారని తాను ప్రజాసేవ చేసేందుకే వచ్చాను కాబట్టి ప్రజల సమస్యలు పరిష్కారం చేసేందుకు ముందుకెళ్తున్నానన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు అండగా వుండి వారి సమస్యలను తన సమస్యలుగా భావిస్తానన్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తాను ముందుండి పోరాడుతానన్నారు. మిగిలిన 4 మండలాల్లో కార్యకర్తలను ఆహ్వానించామని ఖాజీపేట మండలంలో ఆహ్వానించాల్సిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కెసి కాలువ ప్రాజెక్టుల వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖరరెడ్డి, మైదుకూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ శ్రీరాములుయాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మిదేవి, మాజీ సర్పంచ్‌లు ఓబులరెడ్డి, మండల ప్రధానకార్యదర్శి ఓబయ్య యాదవ్ , నారాయణ యాదవ్, ముద్ర సలహా మండలి అధ్యక్షుడు పుల్లయ్యనాయుడు, మార్కెట్ యార్డు డైరెక్టర్లు వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు.