కడప

ఇక ప్రతినెల 30న పౌరహక్కుల దినాన్ని నిర్వహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 15: ఇక నుంచి ప్రతినెలా 30వ తేదిన జిల్లాకేంద్రంతోపాటు మండల కేంద్రంలో పౌరహక్కుల దినాన్ని జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అన్నివర్గాల పౌరులు సమాజంలో వారికున్న హెచ్చుతగ్గులను, అసమానతలను తొలగించేందుకు చట్టం ఏర్పడిందని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు పిఎం కమలమ్మ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రాయలసీమ ఎస్సీ, ఎస్టీ మానవహక్కుల సంక్షేమం వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఎన్నో చట్టాలు తయారుచేశారని తెలిపారు. ఆర్టికల్ 338 కింద ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు న్యాయాధికారాలు అందించడం జరిగిందని, రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీలకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఎస్సీ కులస్తులు ఇచ్చిన ఫిర్యాదులను తీసుకుని సంబంధిత అధికారులకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇక నుంచి పౌరహక్కుల దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, ఈపౌరహక్కుల దినాన్ని ఆది నుంచి ఉందని మానవుడు భూమి మీద పుట్టి 2లక్షల సంవత్సరాలు అయ్యిందని అంతకుముందు కులమతాలు లేవని వానవుడే అవి సృష్టించుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత, గిరిజనుల సంక్షేమం కోసం వేల ఎకరాలు భూములు పంపిణీ చేశారన్నారు. ఎస్సీ,ఎస్టీలు తమ హక్కులు తెలుసుకుని వాటిని పరిరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఎస్సీ,ఎస్టీ మానవహక్కులసంక్షేమం వేదిక అధ్యక్షుడు జెవి రమణ, అంబేద్కర్ మిషన్ జిల్లా అధ్యక్షుడు సంపత్‌కుమార్, దళిత నాయకుడు జయచంద్ర, అమీర్‌పీరా, సైమన్, దళితనాయుడు సంగటి మనోహర్, స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు జయచంద్ర పాల్గొన్నారు.