కడప

అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వంపై జగన్ విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 15: జగన్ అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, తన తండ్రి హయాంలో అక్రమంగా సంపాదించి, సిబిఐ కోర్టులో కేసులు నడుస్తున్నా ప్రజల్లో వాటిని తప్పుదోవపట్టించేందుకే జగన్మోహన్‌రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), రాష్ట్ర నేతలు ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఉక్కుపరిశ్రమ తీసుకురావడానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్ని సిద్ధం చేశారని, ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణంపై ఎటువంటి అపోహలు వద్దని, జగన్మోహన్‌రెడ్డి వామపక్షాలను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి పురిగొల్పుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధిలోనూ, సంక్షేమ పథకాల అమలులోనూ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని ఆయన పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి హార్టికల్చర్ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నారని, ఖనిజసంపదకు ఖిల్లాగా ఉన్న కడప జిల్లాలో కావాల్సినన్ని ఫ్యాక్టరీల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికను రూపొందించారని ఆయన గుర్తు చేశారు. నదుల అనుసంధానం చేయడంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద వేలకోట్లరూపాయలు ఖర్చుచేసి ధనయజ్ఞంగా మార్చి తన తండ్రిని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమంగా లక్షలకోట్లరూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఆయనతోపాటు రాష్ట్ర కార్యదర్శి ఎస్.గోవర్దన్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ పీరయ్య, నగర అధ్యక్షుడు ఎస్.హరీంద్రనాథ్ తదితరులు మాట్లాడుతూ వైఎస్ హయాంలో కంటే బాబు హయాంలో రెండేళ్లలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని వారు పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి తన అవినీతి అక్రమాల ఊబిలో కూరుకుపోయి పశ్చాత్తాప పడకుండా కేవలం ప్రజలను తప్పుదోవపట్టించేందుకే ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు. జగన్‌కు 2019 ఎన్నికల్లో ప్రజలు మరోమారు బుద్ధిచెప్పడంతోపాటు వైకాపా అభ్యర్థులను గెలిపించరని జోష్యం పలికారు.