కడప

పోలీసులు ఫిట్‌నెస్ కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(క్రైమ్)జూలై 17: పోలీసులు ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసు డిజిపి జెవి రాముడు అన్నారు. ఆదివారం సాయంత్రం పోలీసు క్వార్టర్స్‌లో జిమ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం డిజిపి మాట్లాడుతూ శారీరకంగా ధృడత్వం కలిగినప్పుడే మానసికంగా అలసత్వం లేకుండా విధులు నిర్వహించగలుగుతారని డిజిపి పేర్కొన్నారు. తమ శరీరాన్ని అదుపులో ఉంచుకునేందుకు జిమ్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో జిమ్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ మధ్య నెల్లూరులో జిమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల్లో 33శాతం ఎక్కువ బరువు కలిగివున్నారన్నారు. వారిలో అధిక బరువు 15శాతం ఉన్నారని, దీనివల్ల విధులు సరిగా నిర్వర్తించలేకపోవడం జరుగుతోందన్నారు. దీని వల్ల అనారోగ్యంపాలు కావడంతోపాటు రోగాలు కూడా త్వరగా వస్తాయన్నారు. శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రతి పోలీసు జిమ్‌ను ఉపయోగించుకుని స్లిమ్‌గా తయారై శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, ఏఎస్పీ విజయకుమార్, ఓఎస్‌డి (ఆపరేషన్స్) సత్యయేసుబాబు, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, కడప డిఎస్పీ అశోక్‌కుమార్, రాజంపేట డిఎస్పీ రాజేంద్ర, ప్రొద్దుటూరు డిఎస్పీ పూజిత నీలం, జిల్లాలోని డిఎస్పీలు నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, కొండాపురం సిఐ రవిబాబు, సిఐ సదాశివయ్య, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.