కడప

తెలుగుదేశం పార్టీలోకి అందరినీ స్వాగతిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, జూలై 18: తెలుగుదేశం పార్టీలోకి అందరిని స్వాగతిస్తామని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్జి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి స్పష్టం చేసారు. ఆయన సోమవారం రాత్రి స్థానిక పార్టీకార్యాలయంలో నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నేతలు,కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై అన్ని పార్టీల నుంచి తమ పార్టీలోకి వచ్చెందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతలతో చర్చించి వారిని చేర్చుకుంటామన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు, నేతలకు ప్రాధాన్యత ఇచ్చి వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తామన్నారు. గత 50 ఏళ్లుగా నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ది చెందలేదని అయితే ఈరెండేళ్లలో గ్రామాలనుంచి మండలాల వరకు 6కోట్లతో సిమెంటు రోడ్లు చేపట్టామని చెప్పారు. నియోజకవర్గంలో 13కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఫ్రతి గ్రామం నుంచి మండలానికి లింకురోడ్లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా మండలంలోని పనులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. నీరు-చెట్టు పథకం కింద నియోజకవర్గంలో 13చెరువులను అభివృద్ధి పరిచామన్నారు. త్వరలో చెరువుల తూములను కూడా అభివృద్ధి పరిచెందుకు నిధులు మంజూరయ్యాయన్నారు. కమలాపురం మండలంలో నీరు-చెట్టు పథకంద్వారా భూగర్భజలాలు 1 టియంసి పెరిగి జిల్లాలోనే మొదటిస్థానం పొందిందన్నారు. తద్వారా ఈ ఏడాది రైతులు 2 కార్లు పంటలు సాగించారని చెప్పారు. కాగా కొందరు అక్రమ విద్యుత్తులతో పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని అలాకాక సక్రమంగా నాణ్యమైన విద్యుత్తును పొంది అధికారులకు సహకరించాలన్నారు. పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అయితే అవినీతిని సహించ నన్నారు. కొందరు పార్టీలోనే ఉంటూ బ్యాంకుల్లో రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి 12% కమీషను వసూలు చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. మరి కొందరు ఇతర ప్రాంతాల్లో పనులు చేసినట్లు చూపించి కూలీల డబ్బులు కూడా స్వాహా చేస్తున్నారని ఇంకా కొందరు ఎక్కడ కూడా పనులు చేపట్టకుండానే అధికారులకు లంచాలిచ్చి బిల్లులు చేసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి వాటికి తాను తావివ్వనని అన్నారు. గ్రామాల్లో పార్టీలోనే ఉంటూ ముఠాలు,వర్గాలు సృష్టించడాన్ని తెలుగుదేశం పార్టీ సహించదని చెప్పారు. వారిపై అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టరుతో చర్చించి నియోజకవర్గమంతటా అభివృద్ధి పనులు చేపడతామని కడప, కమలాపురం మార్కెట్‌యార్డులకు చెందిన 1.60కోట్ల నిదులతో పలు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రైతుల వ్యవసాయపొలాల్లోకి రోడ్లు నిర్మించేందుకు తాను సియంతో చర్చించానని రైతులు సహకరిస్తే ఈ పనులు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కడప మార్కెట్ యార్డు చైర్మెన్ జయసుబ్బారెడ్డి, చెన్నూరు మండల కన్వీనర్ భాస్కరరెడ్డి మాట్లాడారు. ఇందులో జిల్లాతెలుగుయువత అధ్యక్షుడు దివాకరరెడ్డి, మండల వైస్ వాసుదేవరెడ్డి, 6 మండలాల పార్టీ కన్వీనర్లు, ఎంపిపిలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
50 కుటుంబాలు చేరిక
సమావేశానంతరం మండల వైస్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో చదిపిరాల పంచాయతీ రామచంద్రాపురానికి చెందిన వైసిపికి చెందిన ఇందిరతో సహా 50కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు. అదేవిధంగా గ్రామాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి తాము కృషి చేస్తామని పేర్కొన్నారు.