కడప

ప్రజా సాధికార సర్వేలో జిల్లాలో నందలూరు రెండవ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, జూలై 18:విప్ మేడా మల్లికార్జునరెడ్డి స్వంత మండలమైన నందలూరులో ఆయనకు మంచిపేరు తెచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను విజయవంతం చేయాలని ఎంపిపి మేడా పద్మజ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి పంచాయితీల వారిగా అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సాధికార సర్వేలో నందలూరు డివిజన్‌లో మొదటి స్థానం, జిల్లాలో రెండవ స్థానం పొందిందన్నా రు. ఎంపిడిఓ జుబేధాబేగం మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన తనకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే మండలాన్ని జిల్లాలో మొదటి స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు స్థలాన్ని కేటాయిస్తే భవన నిర్మాణాలు పూర్తి చేస్తామని సొసైటీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ ప్రసాద్, ఎంఇఓ రమణయ్యశెట్టి, ఎఓ శ్రీదేవి, సర్పంచ్ శివప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ దినేష్, పిఆర్ ఏఇ రామకృష్ణమరాజు, ట్రాన్స్‌కో ఏఇ సురేష్ సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.