కడప

ఆదాయపు పన్నుశాఖ అధికారులపై ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 7: ఆదాయ పన్నులశాఖలో కొంతమంది అధికారులు, సిబ్బంది నేరుగా వినియోగదారులతో మాట్లాడుకుని ప్రభుత్వానికి జమ కావాల్సిన పన్నులు పక్కదారి పట్టిస్తున్నారంటూ ఫిర్యాదులు అందటంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సంవత్సరానికి రెండు పర్యాయాలు పరిశ్రమలు, వ్యాపారాలు, వివిధ వాణిజ్య లావాదేవీలపై వారి టర్నోవర్‌లను బట్టి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను వసూలు చేయాల్సిన కొందరు అధికారులు వారే స్వయంగా సంబంధితులకు నోటీసులు జారీ చేసి బేరసారాలు చేసుకుని, నామమాత్రంగా పన్నులు కట్టించుకుని, మిగిలిన మొత్తాలను తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారని ఈ మధ్యకాలంలో ఫిర్యాదులు అందాయి. ఆదాయపన్ను చట్టం 143 (2) ప్రకారం స్క్రూటిని అసెస్‌మెంట్ చేయాలంటూ నేరుగా సంబంధిత వ్యక్తులను కార్యాలయానికి పిలిపించుకుని ఇన్‌కమ్ ట్యాక్స్, సేల్స్‌ట్యాక్స్ ఆడిటర్లు ఇచ్చిన ఆడిట్ రిపోర్టులు పక్కనబెట్టి, తమ ఇష్టారాజ్యంగా ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు నుంచి లక్షల్లో వసూలు చేసుకుని పన్నులు తక్కువ చేసి చూపిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాకు సంబంధించిన ముఖ్య ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి తిరుపతిలో ఉన్నందున, జిల్లా వాసులు పలువురు స్థానిక అధికారుల తీరుపై ఆయనకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా తమ నుంచి భారీ ఎత్తున మొత్తాన్ని తీసుకున్న వివరాలు కూడా ఆయనకు అందించినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు ప్రతులను సిబిఐ అధికారులకు కూడా పంపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సిబిఐ అధికారులు కడప, ప్రొద్దుటూరు , రాజంపేట ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయాల్లో గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.