కడప

పాత కక్షలు విడనాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(లీగల్)డిసెంబర్ 12: జిల్లా వ్యాప్తంగా జాతీయ మెగాలోక్ అదాలత్‌కు భారీ సంఖ్యలో కక్షిదారులు, ముద్దాయిలు హాజరై మొత్తం 1855 కేసులు పరిష్కారమై తద్వారా రూ.8కోట్ల 74లక్షల 60వేల 327 లు సంబంధిత కక్షిదారులకు పంపిణీ చేశామని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.రాఘవరావు పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో భారీ సంఖ్యలో కక్షిదారులు లోక్ అదాలత్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ జిల్లాలో కక్షలు, కార్పణ్యాలు విడనాడి సామరస్యంగా కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకుని గ్రామాలను శాంతియుతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందని, అలాగే ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసుల్లో గెలుపోటములు అనేవి సరిసమానంగా ఉంటాయని, కక్షిదారులు ఓడినా గెలిచినా బాధపడాల్సిన అవసరం లేదన్నారు. వారిని ఉద్దేశించి భగవత్ గీతలోని జననీ జన్మభూమిచ్చా..స్వర్గాదతి గరీయదశి అనే శ్లోకాన్నిప్రజలకు విన్పించారు. జిల్లాకోర్టులో నాలుగు బెంచ్‌లుగా లోక్ అదాలత్ ఏర్పాటై జిల్లా నాల్గవ అదనపు జడ్జి ఇంతియాజ్ అహ్మద్, జిల్లా జడ్జి ఎన్.రాఘవరావు, లోక్ అదాలత్ కార్యదర్శి ప్రసాద్, 2వ అదనపు జూనియర్ జడ్జి దీనాలు నాలుగు బెంచ్‌లుగా ఏర్పాటయ్యారు.
తద్వారా 1855 సివిల్, క్రిమినల్, మోటార్ వాహనాల నష్టపరిహారం కేసులు పరిష్కారమయ్యాయి. దాని ద్వారా రూ.8కోట్ల 74లక్షల 60వేల 327లు బాధితులకు చెక్కు రూపంలో పంపిణీ చేశారు. అలాగే ఉదయం 10గంటల నుంచి సాయంత్రం వరకు కక్షిదారులకు కోర్టువారు నీటి వసతి, భోజన వసతి కల్పించారు. అలాగే గుడారాల్లో వందల సంఖ్యలో కక్షిదారులు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఫ్యామిలీ జడ్జి వి.శ్రీనివాసమూర్తి, ప్రధాన సబ్ జడ్జి జి.అన్వర్‌బాష, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, నేషనల్ ఇన్సురెన్స్ కంపెనీ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ హెచ్.అశ్వర్థనారాయణ, న్యాయవాదులు, పోలీసులు తదితర అధికారులు పాల్గొన్నారు.