కడప

రాయచోటి-రామాపురం రోడ్డు ఫోర్‌లైన్‌గా మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూలై 22: రాయచోటి నుండి రామాపురం మండలం గువ్వలచెరువు వరకు గల జాతీయ రహదారిని ఫోర్‌లైన్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయని, త్వరలోనే టెండర్లను కూడా పిలవడం జరుగుతుందని రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.350 కోట్లతో రాయచోటి-రామాపురం రోడ్డు నాలుగు లేన్లుగా విస్తరణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో రాయచోటిలోని చెక్‌పోస్టు నుండి మాసాపేట వరకు గల జాతీయ రహదారిని పూర్తి సిమెంట్‌రోడ్డుతో నిర్మించడం జరుగుతుందని, వీటి మధ్య గల డివైడర్లతో బటర్‌ఫ్లై లైట్లు, రెండు పక్కల డ్రైన్, దానిపైన ఫుట్‌పాత్ కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ఈ రోడ్డు వలన మాసాపేట బ్రిడ్జి, రామాపురం బ్రిడ్జిలకు మహర్దశ కలుగుతుందన్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో పాటు డ్రైనేజీ సమస్య కూడా తీరనుందన్నారు. పట్టణంలో ఎన్‌క్రోచ్‌మెంట్‌ను పూర్తి సమస్య ఉన్న చోట్ల చర్చించి పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదే విధంగా రూ.150 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాయచోటి-అంగళ్లు డబుల్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. అంతేకాకుండా రాయచోటి-రాయవరం, రాయచోటి-రాజంపేట, రాయచోటి-గడికోట రోడ్డు పనుల ప్రతిపాదనలు పూర్తయ్యాయని, వీటికి కూడా త్వరలో టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ గాజుల ఖాదర్‌బాష, సంబేపల్లె జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి ముస్తాక్‌హుస్సేన్, టీడీపీ వాణిజ్య విభాగపు అధ్యక్షులు గంగిరెడ్డి పాల్గొన్నారు.