కడప

ఉపాధి శిక్షణకై దరఖాస్తు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, జూలై 22: ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగులకు ఉపాధి శిక్షణకై దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూర్యమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫైవ్‌స్టార్, ఫోర్‌స్టార్, త్రీస్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, రీసార్ట్స్ తదితర వాటిల్లో అవసరమయ్యే వంటమాస్టర్లుగా రాణించడానికి అవసరమయ్యే స్కిల్స్ పెంపొందించుకొనుటకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్, ఆఫ్‌స్పెషాలిటీ మేనేజ్‌మెంట్ రంగాలలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో శిక్షణ, వసతి, ఉపాధి సదుపాయం కల్పించడానికి ఔత్సాహికులైన 13 జిల్లాలకు చెందిన షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. కాంట్రాక్టు ఎంటర్‌ప్యూనర్ డెవెలప్‌మెంట్ కోర్సులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఎసి) ప్రాథమిక శిక్షణా కేంద్రంలో మూడునెలల ఉచిత శిక్షణతోపాటు ఉచిత వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. శిక్షణ అనంతరం అభ్యర్థులు ప్రభుత్వంలో కాంట్రాక్టర్లుగా పేర్లు నమోదు చేసుకునే అవకాశం కలదన్నారు. శిక్షణ కొరకు సివిల్ ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీంతోపాటు బహుళజాతి నిర్మాణ సంస్థలో, సివిల్ కాంట్రాక్టర్ల వద్ద, యాజమాన్య రంగంలో రాణించడానికి అవసరమయ్యే (జనరల్ వర్క్స్, సూపర్‌వైజర్, ఫ్లమ్మింగ్ అండ్ శానిటేషన్, ల్యాండ్ సర్వేయర్, వెల్డింగ్, ఎలక్ట్రికల్ అండ్ హౌస్ వైరింగ్, పెయింటింగ్ అండ్ డెకరేట్) తదితర వాటికి సంబంధించి నేషనల్ అకాడమీలో ఉచితంగా శిక్షణనిస్తారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను 25వ తేదీ లోపు కడప స్టెప్ కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు ఎపి ఓవి ఎంఎం ఎస్ డాట్ సిజిజి డాట్ జి ఓవి డాట్ ఇన్‌ను సెర్చ్ చేయాలన్నారు.