కడప

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్‌లైన్ సేవలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కలెక్టరేట్)జూలై 25: రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో రైటర్స్ వ్యవస్థను నిర్మూలించి వినియోగదారులే నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి పనులను చక్కబెట్టేందుకు ఆన్‌లైన్ సేవలు ప్రవేశపెట్టింది. ఈ సేవల ద్వారా వినియోగదారులు తమ రిజిస్ట్రేషన్లను రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటును కల్పించింది. దీనితో వినియోగదారులు దళారుల ఉచ్చులోపడి మోసపోకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడింది. 2000వ సంవత్సరం ముందు రిజిస్ట్రేషన్‌శాఖలో దళారీ వ్యవస్థ ఉండేది. ఈ రైటర్స్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వినియోగదారులను మభ్యపెట్టి లేని రుసుములను చూపించి వినియోగదారుల నుంచి వేలాది రూపాయలు వసూళ్లు చేసేవారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 2000వ సంవత్సరంలో రైటర్స్ వ్యవస్థను రద్దుచేసింది. దీంతో వినియోగదారులు స్వతంత్రంగా నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ శాఖలో తమ పనులు చక్కదిద్దుకుంటున్నారు. వినియోగదారుడు జిల్లాలో ఏ రిజిస్ట్రేషన్ శాఖకు వెళ్లి తన స్థలానికి సంబంధించిన స్థలం, భవనం సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించి నేరుగా అక్కడి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. ఈ ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టడం వల్ల వినియోగదారులకు మేలు చేకూరుతోంది. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి.