కడప

రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, ఏప్రిల్ 7: అతివేగంతోపాటు అజాగ్రత్తతో ఇద్దరు ఎంబి ఎ చదువుతున్న యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేస్తూ తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వివరాలలోకి వెళితే మండల కేంద్రమైన దువ్వూరుకు సమీపంలోని జాతీయ రహదారి కడప - కర్నూలు హైవేలోని ఏకోపల్లె గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున 4గంటలకు ఆగివున్న లారీని ద్విచక్ర వాహనంలో వస్తున్న ప్రవీణ్ (22), నబీరసూల్ (22) అను యువకులు ఆగివున్న లారీని అతివేగంగా వెనుకవైపున ఢీకొన్నారు. ఈ ఘటనలో ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన నబీరసూల్‌ను స్థానికులు, పోలీసుల సహాయంతో ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతులు తిరుపతిలోని చదలవాడ రమణమ్మ కళాశాలలో ఎంబిఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఉగాది పండుగ సెలవులు రావడంతో తమ సొంత ఊరైన కర్నూలుజిల్లాకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. బుధవారం రాత్రి తిరుపతిలో బయలుదేరిన వీరు గురువారం తెల్లవారుజామున కడపజిల్లా దువ్వూరు మండలం వద్ద ప్రమాదానికి గురయ్యారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా రోడ్డుపై లారీని ఆపి నిద్రించడం వలన రాత్రివేళలో రోడ్డుపైనున్న లారీని గమనించక విద్యార్థులు ఇంటికి త్వరగా వెళ్లాలనే ఆలోచనతో ఎపి 21 ఎహెచ్ 0065 అను నెంబరు గల ద్విచక్ర వాహనమైన పల్సర్‌లో వేగంగా వెళుతూ ఎపి 21 టివై 4999 అను నెంబర్ గల లారీని ఢీకొట్టారు. విషయాన్ని తెలుసుకున్న మైదుకూరు డిఎస్పీ రామక్రిష్ణ, రూరల్ సి ఐ నాగభూషణం, దువ్వూరు మండల ఎస్ ఐ మధుసూధన్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలకు ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి తెలిపారు.