కడప

వైకాపా రాష్టబ్రంద్ విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 31: కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించడంతో అందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానం ఈనెల 2న రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో జిల్లాలో బంద్‌ను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మండల, నియోజకవర్గాల స్థాయిలో కీలకనేతలు బంద్‌ను విజయవంతం చేసేందుకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. పోలీసుల అధికారులు కూడా ముందస్తుగానే వైకాపా ఏవైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతుందేమోనని అనుమానంతో పోలీసులు అప్రమత్తమై డేగ కన్నుతో వైకాపానేతల కదలికలపై నిఘా వుంచారు. ఆదివారం ఆ పార్టీ శ్రేణులు పత్రికలకు ప్రకటనలు జారీ చేసి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంద్‌లో బిజెపికి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని కూడా వైకాపా నేతలు టార్గెట్ చేయడంతో అధికార తెలుగుదేశంపార్టీనేతలు కూడా వైకాపా నేతల ఆరోపణలపై స్పందిస్తున్నారు. రాష్టవ్రిభజన సమయంలో పాలనలో ఉన్నది తల్లికాంగ్రెస్ అని, రాష్టవ్రిభజన సమయంలో సంతకాలు చేసి ఒక నిర్దిష్టప్రణాళిక లేకుండా చేతులు దులుపుకుని తల్లికాంగ్రెస్ చేసిన పనే ఈ తతంగమని టిడిపి నేతలు ఎదురుదాడికి దిగారు. బంద్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వైకాపా ఎమ్మెల్యేలు, వైకాపా ఎంపిలు, కీలక నేతలు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రంలో గతంలో ఘర్షణలకు, విధ్వంసాలకు పాల్పడిన వారందరికీ పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వైకాపా శ్రేణులు మాత్రం కార్మికులను, విద్యార్థులను, పారిశ్రామిక, వ్యాపారవేత్తలను బంద్‌ను విజయవంతం చేసి సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలో వైకాపా అందోళనలు తీవ్రతరం చేసేందుకు సర్వశక్తులు వడ్డుతోంది. మొత్తం మీద జగన్ తన సొంత జిల్లాలో పరువు కాపాడుకోవడానికి పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.