కడప

ప్రత్యేకహోదా ఇచ్చేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(లీగల్)ఆగస్టు 2: జిల్లాకోర్టు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి బంద్‌కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కోర్టులోని సివిల్, క్రిమినల్, బెంచ్‌కోర్టుల కేసుల విధులను న్యాయవాదులు బహిష్కరించి అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదాకోసం చేస్తున్న బంద్‌కు మద్దతును ప్రకటించారు.
ఖాజీపేటలో...
ఖాజీపేట: ఆంధ్రప్రదేశ్‌కు తెలుగుదేశంపార్టీ, బిజెపిలు మూకుమ్మడిగా అన్యాయం చేశాయని ప్రత్యేకహోదా ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవి మహేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ జనార్ధన్‌రెడ్డిలు స్పష్టం చేశారు. రాష్ట్ర అధిష్ఠానం పిలుపుమేరకు ప్రత్యేకహోదా కోసం చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. మంగళవారం ఉదయం నుంచే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్చంధంగా సెలవులు ప్రకటించాయి. బస్టాండు కూడళ్లలోని అంగళ్లు సైతం మూసివేశారు. అనంతరం వైకాపా నేతలు గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలువేసి రోడ్డుపై బైటాయించి నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించినా బిల్లులో పొందుపరచలేదంటూ బిజెపి చెప్పడం అందుకు తెలుగుదేశం తల ఊపడం సరిపోయిందని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేసి ప్రస్తుతం మద్దతు ఇవ్వకపోవడం దారుణమన్నారు. టిడిపి ప్రభుత్వం కేంద్రంలో బిజెపితో పొత్తుపెట్టుకుని బిజెపి మాటలకు లొంగిపోయి ఏపికి అన్యాయం చేస్తోందన్నారు. ఇప్పటికైనా టిడిపి బిజెపికి మద్దతు ఉపసంహరించుకుని మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు నాగిరెడ్డి, లక్ష్మిరెడ్డి, మాజీ ఎంపిటిసిలు మనోహర్, వైకాపా నాయకులు శివారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెండ్లిమర్రిలో..
పెండ్లిమర్రి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కోరుతూ వైకాపా, వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం మండలంలో జరిగిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ బంద్‌లో వైకాపా మండల కన్వీనర్ ఎం.చంద్రారెడ్డి, డిసిసిబి సొసైటీ అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి, సర్పంచ్‌లు రఘునాథరెడ్డి, పెద్దసిద్దారెడ్డి, రవీంద్రారెడ్డి, ఎంపిటిసిలు ఉత్తన్న, వెంకటన్న, వైకాపా నాయకులు , వామపక్ష నాయకులు ఉదయం 8గంటల నుంచే కడప-పులివెందుల ప్రధాన రహదారిపై ఏపికి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. వైకాపా మండల కన్వీనర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో, ప్రచారంలో ఏపికి ప్రత్యేకహోదాతోపాటు ప్యాకేజి కూడా ఇస్తామని చెప్పి నేడు మాటమార్చడం సరికాదన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంలో బిజెపితో పొత్తుపెట్టుకుని కూడా ఏపికి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలవౌతూ ప్రజలను మభ్యపెడుతూ రెండుసంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు ప్రత్యేక హోదాకోసం పోరాడిన దాఖలాలు లేవని విమర్శించారు.
చింతకొమ్మదినె్నలో...
చింతకొమ్మదినె్న: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా రాష్ట్ర వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపుమేరకు మంగళవారం వైకాపా నాయకులు, కమ్యూనిస్టు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఉదయం 6గంటలకే జాతీయ రహదారి వెంబడి వైకాపా నాయకులు ఆందోళనలో పాల్గొని ఆటోలను కూడా నిలిపివేశారు. దీంతో భారీ వాహనాలతోపాటు చిన్నవాహనాలు కూడా రహదారి వెంబడి బారులుతీరాయి. మండల వైకాపా నాయకులు సుధాకర్‌రెడ్డి, బాలమల్లారెడ్డిల ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు పాపిరెడ్డి తదితరులు రోడ్లను దిగ్భంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీల ప్రకారం ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించినా ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దీంతో రాష్ట్రప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రత్యేక హోదా ఇస్తే వెనుకబడిన ఏపి కొన్ని వెసులుబాటులు కలుగుతుందని, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నాయకులు ప్రస్తుతం నోరుమెదపక పోవడం ఆందోళన కలిగిస్తోందని , మన రాష్ట్రంలోని బిజెపి నాయకులు పట్టించుకోక పోవడం, తెలుగుదేశంపార్టీ నాయకులు బిజెపితో చెలిమిచేస్తూ రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్టమ్రుఖ్యమంత్రి కేంద్రంతో తెగతెంపులు చేసుకుని రాష్ట్రానికి కావాల్సిన హక్కుల గురించిపోరాడాలని వారు పేర్కొన్నారు. మండల ప్రజలు స్వచ్చంధంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు,అంగళ్లు మూసివేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్రీరామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, ఎంపిటిసిలు హరికుమార్‌తోపాటు మండల వైకాపా నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
కమలాపురంలో..
కమలాపురం: రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం వైయస్సార్‌సిపి ఇచ్చిన బంద్ పిలుపుమేరకు మంగళవారం కమలాపురం మండలంలో అఖిలపక్ష కమిటీ నిర్వహించిన బంద్ విజయవంతమైంది. పట్టణంలో ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, హోటళ్లు, దుకాణాలు, వాణిజ్యసంస్థలు మూతపడ్డాయి. ఆర్‌టిసి బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు సైతం తిరగకపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కడప-తాడిపత్రి హైవేరోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించడంతో రోడ్డు కిరువైపులా వాహనాలు బారులుతీరి నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వైసిపి, సిపిఐ, సిపియం, బిఎస్పీ, ఏఐయస్‌యఫ్, యస్‌యఫ్‌ఐ, నేతలు పట్టణంలో గ్రామచావిడి వద్ద నుంచి హైవే రోడ్డువరకు మోటర్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించి బంద్‌ను నిర్వహించారు. అనంతరం అఖిలపక్ష నేతలు కడప-తాడిపత్రి హైవేరోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ సందర్భంగా వైసిపి మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, జిల్లా వైసిపి రైతు విభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నవన్నీ శుద్ధ అబద్దాలేనని దుయ్యబట్టారు. మిగితా రాష్ట్ర తరహాలోనే ఏ పికి కేంద్రం సాయం అందించిందే తప్ప ప్రత్యేకంగా ఇచ్చింది ఏమి లేదన్నారు. హోదాపై నిలదీస్తే కుంభకోణాల చిట్టా మోడి ఎక్కడ బయటపెడతారోనని బాబు డ్రామాలాడుతున్నారన్నారు. నిజంగా చంద్రబాబుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలా అనే చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించినప్పుడే తమ పార్టీకి చెందిన మంత్రులతో రాజీనామా చేయించి కేంద్రంపై ఎందుకు వత్తిడి పెంచలేదని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పట్టణవైసిపి అధ్యక్షుడు పుల్లారెడ్డి, సిపిఐ నేతలు చంద్రశేఖర్, ఆర్ సుబ్బరాయుడు, బిఎస్పీ నేత రమణా, సిపియం నేతలు సుధాకర్, రమేష్, వైసిపి నేతలు శ్రీనివాసులురెడ్డి, రాజశేఖరరెడ్డి, కొండారెడ్డి, సుబ్బారెడ్డి, ఏఐయస్‌యఫ్ మండల కన్వీనర్ ఉదయ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కాగా రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్న అఖిలపక్ష కమిటీ నేతలను ఎస్సై శ్రీనివాసులురెడ్డి తమ సిబ్బందితో అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.