కడప

ఆప్కో చైర్మన్‌గా గుజ్జల శ్రీను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,ఆగస్టు 4:రాష్ట్ర ఆప్కో చైర్మన్‌గా ఖాజీపేటకు చెందిన ఎంపిపి గుజ్జల సుమలత భర్త గుజ్జల శ్రీను ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఉదయం ప్రమాణస్వీకారం చేసిన గుజ్జల శ్రీనును కడప, ఖాజీపేటకు చెందిన ఆప్కో సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. గుజ్జల శ్రీను గత మూడుసంవత్సరాలుగా ఆప్కో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల ఆప్కో చైర్మన్ హనుమంతరావు అనివార్యకారణాల వల్ల రాజీనామా ఇవ్వడంతో తన ఎంపిక అనివార్యమైందని ఈ ఎంపికకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్రలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆప్కో సంస్థను ఉన్నత స్థితికి తీసుకెళ్తానని, కార్మికులకు అండదండలు అందిస్తానని ఫోన్ ద్వారా ఆంధ్రభూమికి తెలిపారు.