కడప

అవినీతి నిర్మూలనే ఏసిబి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కలెక్టరేట్)ఆగస్టు 4:జిల్లాలో అవినీతి నిర్మూలించడమే అవినీతి నిరోధకశాఖ లక్ష్యమని ఏసిబి డిఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ అవినీతిపైన సమాచారాన్ని ప్రజలు నేరుగా ఏసిబి కార్యాలయానికి వచ్చి తెలపాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే ప్రజలు స్వచ్చంధంగా సమాచారం ఇస్తూ తమకు సహకరించాలన్నారు. ప్రజల్లో ఏసిబి పట్ల పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఏసిబికి సమాచారం ఇస్తే కేసుల్లో కోర్టుచుట్టు తిరగాల్సివస్తుందని తమకు సంబంధించిన బహిర్గతం చేస్తారన్న అపోహలు ఉన్నాయన్నారు. ప్రజలు స్వచ్చంధంగా సహకరించినప్పుడే అవినీతి సమూలంగా రూపుమాపేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటివరకు 12 కేసులు నమోదుచేసినట్లు ఆయన తెలిపారు. ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి దాదాపుగా రూ.3లక్షలు పట్టుకున్నామన్నారు. ఇనె్వస్టిగేషన్, ట్రాఫింగ్ తదితర పద్ధతులద్వారా కేసులను నమోదు చేశామన్నారు.