కడప

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఆగస్టు 4:శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో జిల్లాలో రైతులు ఈ ఏడాది కెసి కెనాల్‌కు నీరు విడుదలవుతుందన్న ఆనందాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 830 అడుగులు పైబడి నీరు చేరడంతోపాటు ఎగువప్రాంతంలో కృష్ణానదిపై నిర్మించిన ఆల్‌మట్టి డ్యామ్, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండటంతోపాటు డ్యామ్‌ల నుంచి వరదనీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతుండటంతో ఈ ఏడాది అయినా కెసి కెనాల్ కింద ఆయకట్టు సాగవుతుందన్న ఆనందంతో రైతులు ఎదురుచూస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో మరో 20అడుగులు నీరు చేరితే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా కెసి కెనాల్‌కు నీరు విడుదలచేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే పట్టిసీమ పేరుతో కర్నూలు-కడప కాలువలకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో కెసి కెనాల్ ఆయకట్టుకు రెండుమూడు రోజుల్లో నీటి విడుదలపై అధికారుల నుంచి ప్రత్యేక సంకేతాలు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 90వేల ఎకరాలకు పైగా కెసి కెనాల్ ఆయకట్టు కింద రైతులు వరిసాగుచేస్తున్నారు. పెద్దముడియం, రాజుపాళెం, చాపాడు, దువ్వూరు , ప్రొద్దుటూరు, మైదుకూరు, ఖాజీపేట , చెన్నూరు, కడప, సికెదినె్న, వల్లూరు తదితర మండలాల్లో కెసి కెనాల్ ఆయకట్టు వుంది. గత ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండకపోవడం, వరిసాగుపై రైతులు ఆశలువదులుకున్నారు. ఆరుతడి పంటలకు ఒకటి రెండు తడులకు మాత్రమే నీరు ఇవ్వడంతో ఆరుతడి పంటలైన జొన్న , ప్రొద్దుతిరుగుడు తదితర పంటలు సాగుచేసుకున్నారు. ఈ ఏడాది భారీవర్షాలు అధికంగా కురవడం వల్ల కర్నాటక రాష్ట్రం నుంచి భారీగా వరదనీరు ప్రాజెక్టుల్లోకి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు వస్తుండటంతో కెసి కెనాల్ ఆయకట్టుకు నీరు అందుతుందన్న ఉద్దేశ్యంతో రైతులు ఇప్పటికే భూములను దుక్కులుదున్ని పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా నీటిని కెసి కెనాల్‌తోపాటు జిల్లాలో తెలుగుగంగకు కూడా నీరందే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా కెసికి నీరు రావడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.