కడప

పిల్లలకు సంగీతం నేర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)ఆగస్టు 5: సంగీతంపట్ల పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చి వారిని ఉన్నతస్థాయికి ఎదిగేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని నగర మేయర్ కె.సురేష్‌బాబు, జిల్లా పర్యాటకరంగ అభివృద్ధి సంఘం గౌరవాధ్యక్షులు సిద్దవటం సీతారామయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రకాష్‌నగర్ విశే్వశ్వరయ్య సర్కిల్‌వద్ద యలపర్తి మధుసూదన్‌చే స్థాపించిన రాగమయి సంగీత పాఠశాలను వారు ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ పాతతరం సినిమా హీరోలు ఎన్‌టిఆర్, ఏఎన్‌ఆర్ లాంటి అగ్రహీరోల ఉన్నతస్థాయికి దోహదపడింది కడప జిల్లా వాసులేనని గుర్తు చేశారు. నేడు సమాజంలో కళలు, కళాకారులు అంతరించిపోతున్నారని వారిని ప్రోత్సహించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం సీతారామయ్య మాట్లాడుతూ సంగీతానికి పుట్టినిల్లు కడప జిల్లా అన్నారు. కడప జిల్లా సంగీతం, సాహిత్యాలకు దేశంలోనే పునాదిలాంటిదని కొనియాడారు. మహాకవి క్షేత్రయ్య కడప జిల్లా ఇనగలూరు వాసి అన్నారు. సినిమా రచయిత ఆరుద్ర కూడా కడప జిల్లావాసేనని గుర్తు చేశారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. నేడుప్రపంచమంతా సంగీతం పట్ల మక్కువ చూపిస్తోందని , ఇలాంటి చిన్న సంగీత పాఠశాలలే రేపు విశ్వవిద్యాలయాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇలాంటి కళాకారులకు టిటిడి సహకారం అందించాలన్నారు. అనంతరం ఆచార్య జి.శివారెడ్డి మాట్లాడుతూ సంగీతానికి ప్రజల నుంచి సరైన ప్రోత్సాహం లేదని సంగీతం పట్ల కనీసం జ్ఞానం కలిగి వుండాలన్నారు. ఇతర రాష్ట్రాలతో మన రాష్ట్రాన్ని పోల్చుకుంటే సంగీతంలో చాలా వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంగీతపాఠశాల నిర్వాహకులు మధుసూదన్, జానమద్ది విజయభాస్కర్, బోగా చిన్నయ్య, కొండూరు జనార్దనరాజు, ప్రముఖ గాయకులు సాంబశివుడు, సంగీత అభిమానులు సావిత్రి, తులశమ్మ, ఉమాదేవి, చమర్తి నారాయణరాజు, నాగవేణి, కె.బాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.