కడప

వడదెబ్బకు ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, ఏప్రిల్ 8: వడదెబ్బ కారణంగా జిల్లాలో శుక్రవారం ముగ్గురు మృత్తువాత పడ్డారు. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె పంచాయితీ కుమ్మరపల్లెకు చెందిన ఓ మహిళ వడదెబ్బకు గురై మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బంధువుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. కుమ్మరపల్లెకు చెందిన గుండు మనోహర్‌రెడ్డి భార్య గుండు ధనలక్ష్మి (59) వడదెబ్బకు గురై ఆనారోగ్యంతో ఉదయం 10 గంటలకు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులకు తెలిపినట్లు వారు తెలిపారు. మండలంలో వడదెబ్బతో గురువారం గొల్లపల్లెకు చెందిన ఆనందీ మనోహర్ మృతి చెందగా, శుక్రవారం ధనలక్ష్మి మృతి చెందడం జరిగింది. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
కమలాపురం: స్థానిక కృష్ణానగర్‌కు చెందిన నాగరత్నమ్మ (30) అనే మహిళ వడదెబ్బ సోకి శుక్రవారం మృతి చెందింది. ఆ మహిళ గురువారం వ్యవసాయపనులపై వెళ్లి తీవ్ర ఎండల కారణంగా పొలాల్లోనే పడి అస్వస్థతకు గురైంది. ఆమెను కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
రైల్వేకోడూరు: పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన షేక్ షరీఫ్ (70) శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. పట్టణంలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో లారీ బ్రోకర్‌గా పనిచేస్తున్న షరీఫ్ గత రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య బీబీ, ఇద్దరు పిల్లలు కలరు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు.ఇదిలావుండగా జిల్లావ్యాప్తంగా గత వారంరోజులుగా వడదెబ్బ మృతులు పెరుగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్య,ఆరోగ్య శాఖ వివిధ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. స్వచ్చంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాయి.