కడప

శ్రీ లక్ష్మీ నరసింహాస్వామికి ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట టౌన్, ఏప్రిల్ 8:పట్టణ శివారులోని భువనగిరిపల్లె గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదానానికి సంబంధించి 13వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు పూల రమణయ్య, రావూరి గోపాలయ్య, పెద్దరామన్నగారి శంకరయ్యలను అన్నదాన సత్రం నిర్వాహకులు పూల సుబ్బయ్య, కంబాయగారి నరసయ్య, కెఎస్ నరసింహా దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్నదాన సత్రం అధ్యక్షులు పూల సుబ్బయ్య మాట్లాడుతూ 2004 సంవత్సరం నుండి భక్తుల కోసం చేపట్టిన అన్నదాన కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా దాతల సహయ, సహకారాలతో నిర్విఘ్నంగా సాగుతుందన్నారు. మధ్యాహ్నం పెద్దఎత్తున భక్తాదులకు అన్నదానాన్ని నిర్వహించారు.