కడప

వైద్యమిత్రల కడుపుకొట్టొద్దు : ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, ఆగస్టు 9: ఎన్‌టి ఆర్ వైద్యసేవ పథకం నందు పనిచేస్తున్న వైద్యమిత్రలు, ఇతర సిబ్బందిని నర్సింగ్ విద్యార్హతల పేరుతో కడుపుకొట్టి రోడ్డున పడేయకుండా యధాతథంగా వారిని కొనసాగేలా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. మంగళవారం ఆయనను జిల్లాలోని పలువురు వైద్యమిత్రలు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వారి సమస్యపై సీఎంకు లేఖ రాశారు. ఎన్‌టి ఆర్ వైద్యసేవ ట్రస్టు సీఈవో రవిశంకర్‌అయ్యన్నార్‌తో ఫోన్లో మాట్లాడారు. పథకంలో తొమ్మిదేళ్ల పాటు చిత్తశుద్ధితో విశేషంగా కృషి చేయడం వల్లనే పథకం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నెట్‌వర్క్ ఆసుపత్రులలో అర్హత కలిగిన వైద్యాధికారులు నర్సింగ్ సిబ్బంది ఉంటారని, వైద్యమిత్రల కేవలం రోగికి, ఆసుపత్రికి అనుసంధానకర్తగా ఉంటూ విధులు నిర్వర్తిస్తారనే విషయం ప్రస్తుత ప్రభుత్వం తెలుసుకుంటే బాగుంటుందన్నారు. వీరినే కొద్ది కాలం పాటు వృత్తిపరమైన శిక్షణ ఇప్పించాలని కోరారు. తొలగింపు ఉత్తర్వులు జీవో నెంబర్ 28ని రద్దు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యమిత్రల సంఘం జిల్లా అద్యక్షుడు ప్రసాదనాయుడు, వైద్యమిత్రలు శ్రీనివాసులు, ప్రసన్నలక్ష్మి, గిరిజ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.