కడప

సెప్టెంబర్ వరకే బాబుకు అల్టిమేటం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 9: కాపులను బిసి జాబితాలో చేర్చుటకు సిఎం చంద్రబాబుకు సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చామని ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కాపులకు బిసి జాబితాలో కలుపుతామని కాపు సోదరులందర్నీ నమ్మించి గద్దెనెక్కి ఎన్నికల హామీలను కాలరాస్తూ పోలీ సు అధికారులు, అధికార యంత్రాంగాన్ని పురిగొల్పి కాపుల ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని, సెప్టెంబర్ 1లోపు ముఖ్యమంత్రి కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మహా ఉద్యమం తప్పదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఆయన మంగళవారం జిల్లా పర్యటన సందర్భంగా కడపలో విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసి తెలుగుదేశం ప్రభుత్వం విధానాలపై తూర్పారబట్టారు. సిఎం చంద్రబాబునాయుడు ఎంతసేపు గత ప్రభుత్వాలు చేసింది ఏమిటీ తమ ప్రభుత్వంలో కాపులకు పెద్దపీట వేశామని చెప్పుకొస్తున్నారు తప్ప కాపుల సంక్షేమం కోసం శాశ్వత ప్రణాళికపై నోరుమెదపకుండా కాపు మంత్రులను తనవద్దకు రాయభారం పంపుతున్నారే తప్ప ఆ కాపు నేతలంతా పెత్తందార్లుగా కొనసాగుతూ తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే కాపులకోసం తాను ప్రాణాలను సైతం అర్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలన్న కాపుల ఆశీస్సులతోనే ముడిపడి ఉంటుందని చంద్రబాబునాయుడు గుర్తించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అధికారం కోసం ఏదేనా లాభాపేక్షకోసం, ఏ ఇతర పార్టీలతో కుమ్మక్కుకావడం తన నైజం కాదని అది చంద్రబాబుకు కూడా తెలుసునని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు ఆరునెలల్లోనే పరిష్కరిస్తామని చెప్పి, ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రోజుకోమాట చెబుతూ కాపులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కాపు పోరాట సమితి నాయకులు నల్లా విష్ణు, రామకృష్ణ, ఏసుదాసు, కడప జిల్లా బలిజసంఘం సీనియర్ నాయకులు పివిఎస్ మూర్తి, నాయకులు ఎస్వీ రాము, కె.కృష్ణమూర్తి, కటిక నాగరాజు, గుర్రప్ప, రాయల్ కేఫ్ చలపతి పాల్గొన్నారు.