కడప

ఖరీఫ్ సీజన్‌లో పంటసాగు విస్తీర్ణం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 11: రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటసాగు విస్తీర్ణం పెంచి అధికదిగుబడులు సాధించే విధంగా వ్యవసాయాధికారులు కృషి చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం వీడియోకాన్ఫరెన్స్ సమావేశ భవనంలో జిల్లాస్థాయి వ్యవసాయాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి వెన్నముక లాంటి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయడం జరుగుతోందన్నారు. రెండవ విడత రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం జిల్లాలో రూ.1200 కోట్లకుగాను రూ.800కోట్లు రైతు రుణమాఫి చేయడం జరిగిందన్నారు. అర్హులైన రైతులందరికీ రుణవిముక్తి అర్హతపత్రాలు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కొంతమంది రైతులకు బ్యాంకుఖాతా, ఆధార్‌నెంబర్‌లు సరిగా లేకపోవడం వల్ల రుణవిముక్తి అర్హతపత్రాలు పొందలేకపోయారన్నారు. అలాంటివారిని అధికారులు ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఉన్నరైతులందరికీ రుణ విముక్తి పత్రాలు అందజేయాలని సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు వివిధ రకాల పంటలుసాగుచేసేందుకు ఆసక్తి చూపుతుంటారన్నారు. రైతులు ఆధునిక సాంకేతిక విధానం ద్వారా మేలైన పంటలు సాగుచేసేందుకు వ్యవసాయశాఖ తమ పరిధిలో చేసే కార్యక్రమాలు రైతులకు చేరువ చేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయపరికరాలు సబ్సిడీతో అందజేస్తుందన్నారు. వీటన్నింటినీ రైతులు సద్వినియోగం చేసుకునేవిధంగా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డ్రమ్‌సీడర్‌ల వల్ల రైతులకు ఎన్నో లాభాలున్నాయని చెప్పారు. ఒక్కో డ్రమ్ సీడర్ సబ్సిడీ పోను రూ.2500లకే ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే రైతులు రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడాలన్నారు. దీని వల్ల పంట దిగుబడి పెరుగుతుందన్నారు. వ్యవసాయశాఖ సిబ్బంది , అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలోని వ్యవసాయాధికారులందరూ రెండు రోజుల్లో మండలాలవారీగా పంటలసాగు వివరాల ప్రోగ్రెస్ రిపోర్టు అందజేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో సిపివో తిప్పేస్వామి, వ్యవసాయశాఖ జెడి ఠాగూర్‌నాయక్, ఆత్మప్రాజెక్టుడైరెక్టర్ భాస్కర్, జిల్లాలోని డిడిఏలు, ఏడిఏలు, పివోలు, సిఆర్‌పిలు, ఎంసివోలు, ఆత్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.