కడప

ఎండిపోతున్న వేరుశెనగ.. ఆందోళనలో రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, ఆగస్టు 11: వేరుశెనగ సాగు చేసిన రైతుల్లో వర్షాభావ పరిస్థితులపై ఆందోళన మొదలైంది. మండలంలో రైతులు గత రెండు నెలల వ్యవధిలో కురిసిన వర్షాన్ని నమ్ముకొని మండల పరిధిలో 1,473 హెక్టార్లు వేరుశెనగ పంటను సాగు చేశారు. రైతులు వేల రూపాయలు అప్పు చేసి బస్తా వేరుశెనగ రూ.1,500 వెచ్చించుకొని దున్నడానికి, గింజలు వేసేందుకు నానా కష్టాలు పడి సాగు చేసిన రైతన్నకు కలవరపాటు మొదలైంది. వానలు దూరమవుతుండటంతో సాగు చేసిన వేరుశెనగ పంట ఎండిపోతున్నది. ప్రస్తుతం ఈ సంవత్సరం ముందస్తు వర్షం కురవడంతో మండల పరిధిలో 1,473 హెక్టార్లు సాగు చేయడంతో ఈ సాగు 85 శాతం మంది వర్షాధారంపైనే ఆధారపడ్డారు. పైరు పలుమార్లు సాగు చేసిన రైతులు ఇంత వరకు కురిసిన వర్షాలు రైతులకు కొంత సంతృప్తిని ఇచ్చింది. అయితే ఇపుడు బాగా పంట వచ్చే సమయంలో, వర్షం బాగా పడాల్సిన సమయంలో వరుణదేవుడు రైతుల కంటి మీద కునుకు లేకుండా చూస్తున్నారు. పగలంతా విపరీతమైన ఎండ, రాత్రంతా చల్లని గాలులు కానీ వర్షం మాత్రం చినుకు రాలడం లేదు. రైతులు వేరుశెనగ పంటపై ఆశలు నింపుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గుండెలు తలుక్కు మంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ శ్రావణ మాసంలోనైనా వర్షాలు వస్తాయని ఎదురుచూస్తున్న రైతన్న ఎదురుచూపు వరుణదేవుడు కరుణించాలని, రైతన్న కడుపు మంట చల్లార్చాలని ఆశిద్దాం.
రైతన్నకు భరోసా..
మండలంలోని రైతులు ఎక్కడైనా వేరుశెనగ పంట ఎండిపోతుందో ఆ రైతులు వ్యవసాయ కార్యాలయానికి వస్తే వేరుశెనగ పంటకు నీటితో తడిపేందుకు పైపులు, రెయిన్‌గన్స్ అందించేందుకు వ్యవసాయాధికారులు సిద్ధంగా ఉన్నారని ఏవో పవన్‌కుమార్ తెలిపారు.