కడప

గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో చెరువుల్లో చేపల పెంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 12: గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చేపల పెంపకానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. పంచాయతీలకు ఆదాయ వనరులు సమకూర్చడం, అభివృద్ధికి చెరువుల్లో చేపల పెంపకం కోసం జిల్లాలో రూ.27 లక్షలతో చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నీరు-చెట్టు పథకం ద్వారా చెరువుల మరమ్మతులు, కాలువల పునరుద్దరణ పనులను చేపట్టారు. చెరువుల్లో ఏవైనా మరమ్మతుల్లో ఉన్నా ఎగువ ప్రాంతాల నుంచి చెరువుల్లో నీరు చేరేందుకు చెరువుల్లో అక్రమాలు తొలగించేందుకు ఉపాధి పథకం ద్వారా నిర్మాణపనులు చేపట్టేందుకు డ్వామాకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో 32 చెరువులను తొలివిడత కింద చేపలను పెంచుతున్నారు. ప్రస్తుతం చేపలకు డిమాండ్ పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకోకుండా జిల్లాలో ఉన్న వనరుల ద్వారా చేపలు పెంచి, జాలర్లద్వారా చేపలు అమ్మకాలు చేసి గ్రామపంచాయతీలకు ఆర్థికపరిపుష్టిని పెంపొందించనున్నారు. ఇప్పటికే చెరువుల్లో మట్టిని తొలగించి చెరువులను కూడా విశాలంగా ఏర్పాటుచేశారు. నీటి కుంటలను కూడా చెరువులకు అనుసంధానం చేశారు. చెరువుల్లో నీరు నిల్వకు పంచాయతీరాజ్, డ్వామా, జలవనరులశాఖచే చెరువుల విస్తీర్ణం పెంచి నీరు నిల్వచేశారు. ఈ నేపధ్యంలో మేలిరకమైన చేప పిల్లలను తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి తెప్పించారు. గతంలో ఇదే తరహాలో చేప పిల్లలు తెప్పించారు. అయితే వాటికి సరైన ఆహారం అందక చాలా వరకు చనిపోయాయి. ఈమారు అలా కాకుండా ముందస్తు జాగ్రత్తలతో మత్స్యశాఖ , వైద్యులు దగ్గరుండి చేపపిల్లలు తీసుకురావడం, మరికొన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమధ్యకాలంలో ఓ మోస్తరు వర్షాలు కురవడం, నీరు-చెట్టు కింద చేపట్టిన పనుల ద్వారా పలు చెరువుల్లో నీరు బాగా ఊటవచ్చింది. జిల్లాలో ఏటా చెరువుల్లో నీరున్న వాటినే ఎంపికచేశారు. ముఖ్యంగా రామాపురం మండలంలోని నీలకంఠరావుపేట, కల్పనాయుని చెరువు, గంగనేరు ప్రాజెక్టు, హసనాపురం, పోరుమామిళ్ల, నందలూరు, జమ్మలమడుగు సున్నపురాళ్లపల్లె చెరువు, పెనగలూరు కనె్నకల చెరువు, రాజంపేట హస్తవరం, పోలి, మన్నూరు చెరువును , చిట్వేలు ఎల్లంవారిపల్లె చెరువు, ఒంటిమిట్ట చెరువు, దువ్వూరు మండలం చెరువులు, చింతకుంట, మైలవరం చెరువు, బి.కోడూరు , రాజుపాలెం, సగిలేరు డ్యామ్‌లు, రామసముద్రం, కలసపాడు, పడికోలి చెరువు, వీరబల్లి చెరువు, ఖాజీపేట పుల్లూరు, రావులపల్లె చెరువు, బి.మఠం మాడేరు ప్రాజెక్టు, చింతకొమ్మదినె్న పెద్ద చెరువు, కమలాపురం చెరువు, లక్కిరెడ్డిపల్లె దినె్నపాడుచెరువులల్లో చేపల పెంపకానికి సంబంధిత ప్రాంత మత్య్స శాఖ అధికారులు చేపపిల్లలు పెంచుతారు. అయితే చెరువుల నిర్వహణలో గ్రామపంచాయతీలకే పూర్తి అధికారాలు అప్పగించారు. చేపపిల్లలు వదిలే కార్యక్రమానికి, చేపలు గాళం వేసేవారికి, మత్స్యశాఖ మార్కెటింగ్ గ్రామపంచాయతీ అధికారులు సమన్వయం , పారదర్శకతో వేలం వేసి గ్రామపంచాయతీలకు ఆదాయ వనరులు సమకూరుస్తూ సామాన్య ప్రజలకు సైతం చేపలు అందేలా చర్యలు చేపట్టారు.