కడప

సిఎంను ప్రశ్నించే హక్కు ముద్రగడకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 12: కాపు కులస్తులను (బలిజ,తెలగ,ఒంటరి) బిసి జాబితాలో చేర్చాలని, బలిజల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడును అడిగే హక్కు ముద్రగడ పద్మనాభంకు లేదని కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విపి.నారాయణస్వామి రాయల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ముద్రగడ తన స్వలాభం కోసం తూర్పుగోదావరిలో కాపులు అధికంగా ఉన్న ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా బరిలోదిగి కేవలం 7వేల ఓట్లు సాధించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి నేడు కాపుల అభివృద్ధికోసం, హక్కుల కోసం పోరాడుతున్నానని కళ్లబొల్లి మాటలు చెప్పి బలిజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ముద్రగడ అవివేకమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బలిజ కులస్తులందరూ తెలుగుదేశంపార్టీకి మద్దతు ఇవ్వాలని రాష్టవ్య్రాప్తంగా ప్రచారం చేసి మద్దుతు ఇచ్చింది తామేనన్న విషయా న్ని గుర్తుంచుకోవాలన్నారు. మొట్టమొదటగా కాపులను బిసిల్లో చేర్చాలని కోరింది తామేనని స్పష్టంచేశారు. 13 జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర కాపునాయకులు బిసి స్టేటస్‌ను బిసిలకు నష్టం జరగకుండా బిసి రిజర్వేషన్ పెంచి, సుప్రీంకోర్టు ఆర్డర్ 259 ప్రకారం ఇంకా ఏపిలో 21శాతం పెంచుకునేందుకు ఒప్పించిన ఘనత తమ సంఘానికే ఉందని నారాయస్వామి స్పష్టంచేశారు. నేడు రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయిన ముద్రగడకు ఇప్పుడు బలిజల అభివృద్ధి గుర్తుకురావడం హాస్యాస్పదమన్నారు. గతంలో టిడిపిలో మంత్రిగా ఉన్న సమయంలో ముద్రగడకు కాపుల అభివృద్ధి పట్టలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో కాపు కులస్తులు ఇచ్చిన మాటను అంచలంచెలుగా నెరవేరుస్తున్నారని స్పష్టం చేశారు. కడప జిల్లాలో రెండురోజుల పర్యటన చేసిన ముద్రగడకు ఆయన వెంట జిల్లాలోని కాపుసామాజికవర్గం నేతలు ఎవ్వరూలేరన్నారు. ముద్రగడ దీక్ష చేసిన సమయంలో కూడా జిల్లాలోని కొంతమంది మాయమాటలు చెప్పి అమాయకులైన కాపులను నమ్మించి తీసుకెళ్లారన్నారు. ముద్రగడ రాష్టవ్య్రాప్తంగా ఎక్కడ పర్యటించిన కాపులు ఎవ్వరూ ఆయన్ను కలిసి మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు. రాష్టవ్య్రాప్తంగా కాపులంతా టిడిపి వైపే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.