కడప

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, ఆగస్టు 15: ట్రిపుల్ ఐటీలలో విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి నైపుణ్యం గల ఇంజనీర్ స్థాయికి ఎదగాలని రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వ విద్యాలయం కులపతి రాజిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటితో మనకు స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను మనం నెమరేసుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఈ ట్రిపుల్ ఐటీలను స్థాపించడం జరిగిందన్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైబ్రరీని ఆయన ప్రారంభించారు. అలాగే ఇటీవల ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలు పొందిన నూతన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను కూడా ఆయన తిలకించారు. అదే విధంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్‌ను కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ ఉపకులపతి విజయప్రకాష్, ఆర్కే వ్యాలీ డైరెక్టర్ భగవన్నారాయణ, ఏవో విశ్వనాధరెడ్డి, ఆర్థిక శాఖ కే ఎల్ ఎం రెడ్డి తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.